Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా.. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

Puducherry CM Tests Corona positive
పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా.. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
  • ఆయనతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న మరో 11 మందికీ సోకిన మహమ్మారి
  • చికిత్స కోసం చెన్నై వెళ్లారన్న అధికారులు
ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నిన్న కరోనా బారినపడ్డారు. ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి నిన్న పరీక్షలకు వెళ్లిన ముఖ్యమంత్రికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు నిన్న సాయంత్రమే బయలుదేరి వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ  స్వీకార కార్యక్రమానికి హాజరైన 11 మందికి కూడా వైరస్ సంక్రమించినట్టు తెలుస్తోంది.

Related posts

ఎర్ర చీమల దెబ్బకు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు..

Drukpadam

అమరావతి రైతుల యాత్రపై హైకోర్టులో విచారణ..కోర్టు హాలులోమంత్రి అమర్ నాథ్!.

Drukpadam

మన సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ సాధన: సీఎం కేసీఆర్

Drukpadam

Leave a Comment