Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఏపీ అంబులెన్స్ లను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు…

ఏపీ అంబులెన్స్ లను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు…
-సరిహద్దులకు చేరుకున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
– సమస్యను పరిష్కరానికి చొరవ ఆంబులెన్సులకు లైన్ క్లియర్
ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించారు. ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను సోమవారం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లి తెలంగాణ పోలీసులతో చర్చించారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ లను ఏ రాష్ట్రంలో కూడా ఆపడం లేదని, తెలంగాణ పోలీసులు మాత్రం కొత్త నిబంధనలు తీసుకువచ్చారని అన్నారు. హైదరాబాద్ నుండి ప్రతిరోజూ విజయవాడ వైపు అంబులెన్స్ లు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు అంబులెన్స్ లను అపలేదని తెలిపారు. తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే కోవిడ్ బాధితుల అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్ వద్ద పంపించాలని కోరారు. అనంతరం విజయవాడ వైపు నుండి వచ్చిన రెండు అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు హైదరాబాద్ వైపు పంపించారు.

Related posts

ఓమిక్రాన్ వ్యాప్తినిరోదానికి తెలంగాణ సర్కార్ కఠిన నిర్ణయం…

Drukpadam

ఆనందయ్య మందుపై ఆయుష్ కమిషనర్ వివరణ…

Drukpadam

నాసిక్‌లోని ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం.. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్‌.. 22 మంది మృతి

Drukpadam

Leave a Comment