Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

దేశంలో కరొనపై సోనూసూద్ ఆశక్తికర వ్యాఖ్యలు

Sonu Sood opines in nation preparedness against corona pandemic
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం ఎప్పుడూ సన్నద్ధంగా లేదు: సోనూ సూద్
  • భారత్ లో కరోనా విలయం
  • సన్నద్ధత లేకుండా కరోనాను ఎదుర్కోలేమన్న సోనూ
  • జీడీపీలో ఒకట్రెండు శాతం ఖర్చు చేస్తే సరిపోదని వ్యాఖ్యలు
  • ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు వెల్లడి
భారత్ లో కరోనా వైరస్ మహోద్ధృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా రక్కసిని ఎదుర్కోవడంలో దేశం ఏ దశలోనూ సన్నద్ధతతో లేదని స్పష్టం చేశారు.

దేశ జీడీపీలో ఒకట్రెండు శాతం మాత్రమే ఆరోగ్య వ్యవస్థలపై ఖర్చు చేస్తున్నారని, ఈ విధమైన చర్యలతో కొవిడ్ ను ఎప్పటికీ ఎదుర్కోలేమని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు. భారత్ అత్యధిక జనాభా ఉన్న దేశమే అయినా, జనాభా అంశాన్ని అందుకు సాకుగా చూపలేమని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో మనం పొరబాట్లు చేశామన్న అంశాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు.

ఇక, సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కు అత్యధిక డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో… భారత్ లో విస్తృత స్థాయిలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తాను చైనా, ఫ్రాన్స్, తైవాన్ దేశాలతో చర్చిస్తున్నట్టు సోనూ సూద్ వెల్లడించారు.

Related posts

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకింది: చిరంజీవి

Drukpadam

డబుల్ మ్యూటెంట్‌కు వ్యాక్సిన్‌నుంచి తప్పించుకున్నట్లు ఆధారాలు లేవు … …సౌమ్య స్వామినాథన్‌

Drukpadam

మాస్క్ అవసరం లేని దేశంగా ఇజ్రాయిల్

Drukpadam

Leave a Comment