Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీకి మరో భారీ షాక్!

హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీకి మరో భారీ షాక్!

  • హిండెన్‌బర్గ్‌ నివేదికతో గౌతమ్ అదానీకి తప్పని తిప్పలు
  • 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ సంపద
  • బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో వెల్లడి

అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. ఆయన ఆస్తుల మార్కెట్ విలువ సోమవారం 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద 49.1 బిలియన్ డాలర్లని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌‌ వివరాల్లో వెల్లడైంది.

సరిగ్గా నెల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో ఆయన సంపద మార్కెట్ విలువ ఏకంగా 120 బిలియన్ డాలర్ల మార్కును చేరింది.  ఆ తరువాత.. అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందన్న హిండెన్‌బర్గ్ నివేదికతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన నాటి నుంచీ ఇప్పటివరకూ అదానీ సంస్థల మార్కెట్ విలువలో ఏకంగా 120 బిలియన్ డాలర్ల మేర కోత పడింది.

ఈ పరిణామాలు అదానీ వ్యక్తిగత ఆస్తుల విలువపైనా ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఆయన ఆస్తుల విలువ ఏకంగా 71 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. అయితే.. అదానీ మాత్రం తొలి నుంచి హిండెన్‌బర్గ్ నివేదికను ఖండిస్తూ వస్తున్నారు.

Related posts

బీహార్ లో దారుణం…జర్నలిస్ట్ ను కాల్చి చంపిన దుండగులు …

Ram Narayana

ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు … చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ

Ram Narayana

యూపీలో బీజేపీ మహిళా కార్యకర్తల ఫైటింగ్.. వీడియో ఇదిగో!

Ram Narayana

Leave a Comment