Indigo Airlines
జాతీయ వార్తలు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • చండీగఢ్ నుంచి వస్తున్న విమానంలో బాంబు ఉందని ఫోన్
  • సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయిన ఇండిగో విమానం
  • విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్ స్క్వాడ్

ముంబై విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. చండీగఢ్ నుంచి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్టు వారు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ విమానం ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అప్పటికే సిద్ధంగా ఉన్న బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానంలో ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. మరో వైపు పాకిస్థాన్ తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాలను మూసి వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్ సర్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసి వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిని తెరవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Related posts

హరిద్వార్‌ జైలులో ‘రామ్‌లీలా’ నాటకం.. వానరులుగా నటించి పరారైన ఇద్ద‌రు ఖైదీలు!

Ram Narayana

 జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఆర్మీ జవాన్ల వీరమరణం

Ram Narayana

 కేసుల విచారణపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana