Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు …

కేసీఆర్ పై కేఏ పాల్  అనుచిత వ్యాఖ్యలు …
-మహామహా నేతలే నా ముందు మోకరిల్లారు… కేసీఆర్ ఎంత?: కేఏ పాల్
-కేసీఆర్ దొంగ అని రుజువు చేస్తా
-నేను ప్రార్థిస్తే కేసీఆర్ నాశనం అవుతారు
-నా సోదరుడి హత్య కేసును తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారు

రాజకీయాల్లో హాస్యం పండించే కేఏ పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు . ఆయన మాటలను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోయినా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగ అని రుజువు చేస్తానని ,నేను ప్రార్ధనలు చేస్తే నాశనం అవుతాడని నోటిదూల మాటలు అనడం పై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను నేరుగా ఎదుర్కోలేక, తన సోదరుడి హత్య కేసును తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోని మహామహా నేతలనే తన ముందు మోకరిల్లేలా చేశానని… తన ముందు కేసీఆర్ ఎంత? అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ తనను చంపేస్తే తాను స్వర్గానికి వెళ్తానని… కానీ చేసిన అవినీతికి కేసీఆర్ మాత్రం నరకానికే వెళ్తారని అన్నారు. తాను ప్రార్థిస్తే చాలు కేసీఆర్ సర్వనాశనం అవుతారని చెప్పారు. దైవ దూతల మీద చేయి వేస్తే దేవుడు క్షమించడని… వైయస్ రాజశేఖరరెడ్డి, తన తమ్ముడు కూడా భూమి మీద నుంచి వెళ్లిపోయారని అన్నారు. కేసీఆర్ దొర కాదు… దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని చెప్పారు.

Related posts

మోదీ ప్రధాని అయ్యింది ఉల్లిపాయల ధరలు తగ్గించడానికి కాదు!: కేంద్ర మంత్రి పాటిల్

Drukpadam

ఆదర్శంలో కమ్యూనిస్టులకు సాటి మరెవరు లేరు …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు!

Drukpadam

ఇది మైసూరా రాజకీయం …మరోసారి గ్రేటర్ రాయలసీమ ప్రస్తావన…

Drukpadam

Leave a Comment