Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. వేడెక్కనున్న రాజకీయాలు!

అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. వేడెక్కనున్న రాజకీయాలు

  • మార్చి 12న అమిత్ షా పర్యటన
  • అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాక
  • అదే రోజు ఓ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భారీ సభ ఉండే చాన్స్ 

తెలంగాణలో రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వరుస కార్యక్రమాలతో ఇప్పటికే బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. షా  మార్చి 12న తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా షా హైదరాబాద్ కు వస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. అయితే, అదే రోజు రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమం తర్వాత రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ నేతలతో షా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన ఉంటుందని అంటున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసింది. దీనికి మంచి స్పందనే వస్తుంది. మార్చి 12న నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

Related posts

కాంగ్రెస్ ఎంపీ భార్య పాటను ఎన్నికల ప్రచారంలో  ఉపయోగించుకుంటున్న తమిళనాడు బీజేపీ!

Drukpadam

జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ కు షాక్ ఇచ్చిన అనుయాయులు !

Drukpadam

దళిత సీఎంకు కాంగ్రెస్ అడ్డుపడిందా? తామే చేయనివ్వలేదని షబ్బీర్ అలీ చెప్పారా ??

Drukpadam

Leave a Comment