Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అద్దాల వంతెన ఎంతపని చేసింది

అద్దాలవంతెననుంచిఊడిపోయినఅద్దాలు.. 330 అడుగులఎత్తునగాల్లోవేలాడినవ్యక్తి!

  • చైనాలోని లాంగ్జింగ్ లో ఘటన
  • 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • సురక్షితంగా తీసుకొచ్చిన బలగాలు

చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో 330 అడుగుల ఎత్తున రెండంచులను కలిపే అద్దాల వంతెన. దాని మీద నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తే వచ్చే ఆ మజాయే వేరు కదా! మజా పక్కన పెడితే.. మన ఖర్మ కాలి ఆ అద్దాలు ఊడిపోయాయనుకోండి.. ఆ గ్యాప్ లో మీరు వేలాడుతున్నారనుకోండి..! ఏంటి పరిస్థితి? ఏముంది గాల్లో వేలాడిన ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి కదా!

అచ్చంగా ఇదే జరిగింది చైనాకు చెందిన ఓ వ్యక్తికి. చైనాలోని లాంగ్జింగ్ లోని పియాన్  మౌంటెయిన్ కల్చరల్ టూరిజం సీనిక్ ఏరియా వద్ద ఉన్న అద్దాల వంతెన వద్ద శుక్రవారం జరిగిందీ ఘటన. ఓ టూరిస్ట్ అద్దాల వంతెనపై నడుస్తుండగా.. అకస్మాత్తుగా గాలి వీచింది. కొద్ది సేపట్లోనే గాలి వేగం 150 కిలోమీటర్లకు పెరిగింది.

ఆ ఈదురుగాలుల ధాటికి వంతెన అద్దాలన్నీ ఊడిపోయాయి. కంగారుపడిపోకుండా ఆ వ్యక్తి వెంటనే సమయస్ఫూర్తితో పక్కలకు పెట్టిన ఇనుప కడ్డీలను పట్టుకున్నాడు. కింద ఏ ఆధారమూ లేకపోవడంతో చాలా సేపు దానిని పట్టుకుని అలాగే వేలాడాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అతడిని కాపాడారు. ఈ ఘటన వివరాలను లాంగ్జింగ్ నగర పాలక సంస్థ చైనా సామాజిక మాధ్యమ సైట్ అయిన వీబోలో పోస్ట్ చేసింది.

Related posts

పులివెందుల సభలో జగన్ పై చంద్రబాబు విసుర్లు ..తన సభకు వెల్లువలా జనం రావడంపై సంతోషం …

Ram Narayana

సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్ట్ కు రాఘురామ మెడికల్ రిపోర్ట్…

Drukpadam

హెల్త్ ప్లాన్లలో టాపప్ – సూపర్ టాపప్ వేర్వేరు!

Drukpadam

Leave a Comment