Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మెడికో ప్రీతి బ్రెయిన్ డెడ్ …సన్నగిల్లిన ఆశలు అంటున్న తండ్రి!

మెడికో ప్రీతి బ్రెయిన్ డెడ్ …సన్నగిల్లిన ఆశలు అంటున్న తండ్రి!
-అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి
-బ్రెయిన్ డెడ్ అంటున్నారని ప్రీతి తండ్రి వెల్లడి
-ఇటీవల వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి
-హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స
-నిమ్స్ వద్ద పోలిసుల భారీ బందోబస్తు

ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్టు తెలుస్తోంది.

ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, వైద్యులు కష్టమేనని అంటున్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందని అన్నారు. మొదటిరోజుతో పోల్చితే తమ కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తోందని, శరీరం రంగు కూడా మారిపోతోందని తెలిపారు.

నిన్నటి వరకు కొంత ఆశ ఉండేదని, ఇప్పుడది కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కాసేపట్లో ప్రీతి ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక బులెటిన్ విడుదల చేయనున్నారు. నిమ్స్ వద్ద భద్రతను పెంచారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు మెడికల్ విద్యార్థిని ప్రీతి తల్లికి ఫోన్!

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి ఆవేదన వెళ్లబోసుకుంది. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.

‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారు. సీనియర్లంతా ఒక్కటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకపోయింది. సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై కంప్లైంట్ ఇస్తే.. సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్ఓడీ నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు’’ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది.

సైఫ్‌తో తాను మాట్లాడతానని.. సమస్య లేకుండా చూస్తానని తల్లి ఆమెకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉంది.

Related posts

కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన సిబ్బంది… పాముతో కరిపిస్తానంటూ మహిళ బెదిరింపు!

Drukpadam

‘నెమలి మాంసం కూర’ వీడియో పోస్టు చేసిన తెలంగాణ యూట్యూబర్ అరెస్ట్!

Ram Narayana

వైయస్ వివేకా హత్య కేసు.. ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్ట్!

Drukpadam

Leave a Comment