Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం …అన్ని వైసీపీ ఖాతాలోకే …!

ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు… ఏపీలో ఏకగ్రీవమైన స్థానాలు ఇవే!

  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఈ నెల 13న పోలింగ్
  • ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవం
  • వైసీపీ అభ్యర్థుల విజయకేతనం

ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో, ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవన్నీ వైసీపీ బలపరిచిన అభ్యర్థులకే దక్కాయి.

విజేతల వివరాలు…
మేరుగ మురళీధర్- నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
కె.సూర్యనారాయణ- తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
రామసుబ్బారెడ్డి- కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
డాక్టర్ సుబ్రహ్మణ్యం- చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
మంగమ్మ- అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ

ఐదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో… మిగిలిన 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ నిర్వహించనున్నారు.

Related posts

రాందేవ్ బాబాను చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలి: సీపీఐ నారాయణ!

Drukpadam

Microsoft Details Updates To The Bing Maps Web Control

Drukpadam

తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్ ను గెలిపించండి …పవన్ కళ్యాణ్ పిలుపు

Ram Narayana

Leave a Comment