Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన లోక్ సభ సచివాలయం!

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన లోక్ సభ సచివాలయం!

  • లోక్ సభ బీఏసీ గుర్తింపును కోల్పోయిన బీఆర్ఎస్
  • ఇకపై ఆహ్వానిత పార్టీగానే ఉండనున్న బీఆర్ఎస్
  • ఆహ్వానం వస్తేనే సమావేశానికి హాజరు కావాల్సిన వైనం
ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. లోక్ సభ బీఏసీ నుంచి ఆ పార్టీ గుర్తింపు కోల్పోయింది. బీఆర్ఎస్ కు లోక్ సభ సచివాలయం గుర్తింపును ఇవ్వలేదు. బీఆర్ఎస్ తరపున బీఏసీ సభ్యుడిగా ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఈరోజు ఉదయం జరిగిన బీఏసీ సమావేశానికి ఆయనను బీఏసీ సభ్యుడిగా కాకుండా… కేవలం ఒక ఆహ్వానితుడిగానే లోక్ సభ సచివాలయం ఆహ్వానించింది. వాస్తవానికి ఆరుగురు కంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. బీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ లోక్ సభ సచివాలయం ఆ పార్టీకి గుర్తింపును తొలగించింది. ఇకపై బీఏసీలో బీఆర్ఎస్ కేవలం ఆహ్వానిత పార్టీగా మాత్రమే ఉంటుంది. ఆహ్వానం వస్తేనే బీఏసీ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది.

Related posts

ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన కాబోయే సీఎం!

Drukpadam

శరద్ పవార్ ను రాష్ట్రపతి రేసులో నిలిపేందుకు రంగంలోకి దీదీ!

Drukpadam

కన్ఫ్యూజన్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

Drukpadam

Leave a Comment