Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ రాజకీయాల్లోకి రేణుక చౌదరి ..ఖమ్మం కు బై బై చెపుతారా …?

ఏపీ రాజకీయాల్లోకి రేణుక చౌదరిఖమ్మం కు బై బై చెపుతారా …?
జగన్ పాలపై విమర్శలు వర్షం ….
ఏపీ ప్రజలు నన్ను రమ్మంటున్నరన్న రేణుకాచౌదరి
ఎవరు ఆపుతారో చూస్తా అంటూ ఘీంకరింపులు
నాలుగేళ్లుగా ఏపీ ప్రజలు నరకం అనుభవిస్తున్నారని మండిపాటు
రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ధ్వజం
అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీలో పోటీ చేస్తానని వెల్లడి ..
కేసీఆర్ తమపార్టీలో తెలంగాణ అనేది లేకుండా తొలగించారని వ్యాఖ్య

ఏపీ రాజకీయాల్లోకి వెళ్లేందుకు మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి ఆసక్తి చూపుతున్నారు .ఇప్పటివరకు తెలంగాణ లోని ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రేణుకాచౌదరి ఇక ఖమ్మం కు బైబై చెప్పనున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమె మాత్రం తనను ఏపీ ప్రజలు రమ్మంటున్నారని అంటున్నారు . ఆమె ఖమ్మం అసెంబ్లీ , లేదా పార్లమెంట్ కు పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్నా వేళ ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆమె తెలంగాణ లో ఉండి ఖమ్మం రాజకీయాల్లో కొనసాగుతున్న రేణుకాచౌదరి గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలపై మక్కువ చూపుతున్నారు .అమరావతి రాజధానికి కోసం అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమానికి స్వయంగా వెళ్లి మద్దతు ప్రకటించారు.వారితో కలిసి పాదయాత్ర కూడా చేశారు . సందర్భంగా ,వైసీపీపై అక్కడ నేతలపై విమర్శలు చేశారు .దీనిపై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు .దీంతో రెచ్చిపోయిన రేణుక చౌదరి గుడివాడ నుంచి కొడాలి నాని పై పోటీచేస్తానని సవాల్ విసిరారుఇటు తెలంగాణ ,అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు కాళ్ళు పెట్టి తనను ఆంధ్రా రాజకీయాల్లోకి రాకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ ఘీంకరిస్తున్నారు .ఆమెను ఎవరు అడ్డుకున్నారో చెప్పకుండానే తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అనడం అనేక సందేహాలకు తావిస్తోందని పరిశీలకుల భావనరేణుక చౌదరికి ఎక్కడైనా రాజకీయాలు చేసే అధికారం హక్కు ఉన్నది .దాన్ని ఎవరు కాదనలేదు ..కానీ ఆమెకు ఆమె నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అనడం వెనక రహస్య ఎజెండా ఏమైనా ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఏపీలో తాను ఎక్కడైనా తిరుగుతాననితనను ఎవరు ఆపుతారో చూస్తానని రేణుకా చౌదరి అనడం పై క్లారిటీ రావాల్సి ఉంది . ఆంధ్రప్రదేశ్ లో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఏమైనా మాట్లాడితే కులాల పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల తీరును ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ఏపీకి రావాలని తనను ఇక్కడి ప్రజలు ఆహ్వానిస్తున్నారనికాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఏపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన కేసీఆర్ఆయన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతానని అంటున్నారని ఎద్దేవా చేశారు.

Related posts

రాజీనామా చేస్తూ కంటతడి పెట్టిన యడియూరప్ప నాకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఆవేదన!

Drukpadam

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో ఫుల్‌స్టాప్..

Drukpadam

శ్రీలంకలో విస్తరిస్తున్న చైనా కార్యకలాపాలు.. భారత వర్గాలలో ఆందోళన!

Drukpadam

Leave a Comment