Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మార్చి 10న ఢిల్లీలో ధర్నాకు ఎమ్మెల్సీ కవిత పిలుపు…!

ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత!

  • మార్చి 10న ధర్నా చేపట్టనున్న కవిత
  • పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటూ డిమాండ్
  • భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ధర్నా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధానిలో ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా నిర్వహించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కవిత ఈ ధర్నా చేపడుతున్నారు. దీనిపై కవిత మాట్లాడుతూ, దేశంలో బీసీ గణన కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా కవితను ప్రశ్నించింది.

అందుకు కవిత బదులిస్తూ… బీజేపీ నాయకులు చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. అరెస్ట్ గురించి ఏ దర్యాప్తు సంస్థ చెప్పాలో ఆ సంస్థే చెప్పాలి తప్ప బీజేపీ నేతలు కాదు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని బీజేపీ నేతలు తెలుసుకోవాలి” అని కవిత హితవు పలికారు.

Related posts

మాది అణ్వస్త్ర దేశం… భారత్ ను బెదిరించిన పాక్ మహిళా మంత్రి!

Drukpadam

సిద్దరామయ్య గొడ్డు మాంసం గోల ….

Drukpadam

మోదీ కాన్వాయ్‌ను అడ్డగించింది మేమే.. ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ !

Drukpadam

Leave a Comment