Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానులపై విచారణ ముందుగా చేపట్టలేము …సుప్రీం …!

‘అమరావతి’పై ఆ రోజే విచారణ.. త్వరగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వ వినతిపై సుప్రీంకోర్టు!

  • అమరావతికి సంబంధించిన కేసుల విషయంలో సుప్రీంకోర్టులో జగన్‌ సర్కారుకు ఎదురుదెబ్బ
  • త్వరగా విచారణ పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం
  • ఈనెల 28నే విచారిస్తామని తేల్చిచెప్పిన జస్టిస్ కేఎం జోసెఫ్ బెంచ్
  • సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకూ అనుమతి నిరాకరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విషయంలో జగన్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. గతంలో చెప్పినట్లుగానే ఈ నెల 28వ తేదీనే అమరావతిపై దాఖలైన పిటిషన్ల విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చిచెప్పింది. 

రాజ్యాంగపరమైన అంశాలు ఇందులో చాలా ఇమిడి ఉన్నాయని ఈ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్నారు. ఈ కేసు చాలా పెద్దదని, విచారణ చేపడితే దానికి సార్థకత ఉండాలని వ్యాఖ్యానించారు. తమ వినతిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతినివ్వాలని న్యాయవాదులు కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది.

అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. అయితే త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత సోమవారం.. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తాజాగా ఈ రోజు మరోసారి అభ్యర్థించగా.. సుప్రీం నిరాకరించింది.

Related posts

రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉంది: రాష్ట్రపతి కోవింద్!

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు.. చెన్నై అపోలోకు తరలింపు!

Drukpadam

ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియామకం…

Ram Narayana

Leave a Comment