Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లిక్కర్ స్కాం సూత్రధారి ,పాత్రధారి కవితే …ఆమె అరెస్ట్ ఖాయం …బీజేపీ నేత ప్రభాకర్ …

కల్వకుంట్ల కవిత మహిళా ద్రోహి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్!

  • లిక్కర్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి కవితే అన్న ప్రభాకర్
  • కవిత అరెస్ట్ కావడం ఖాయమని వ్యాఖ్య
  • గవర్నర్ పై సుప్రీంకోర్టుకు వెళ్లడం దారుణమని విమర్శ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి రెండూ ఆమే అని ఆరోపించారు. ఈ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడం ఖాయమని… అయితే అరెస్ట్ ను కూడా సానుభూతి రాజకీయాలకు వాడుకుంటారని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవిత స్పందించిందే లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర మహిళా గవర్నర్ తమిళిసై గురించి బీఆర్ఎస్ నేతలు పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడుతున్నా పట్టించుకోని కవిత… ఢిల్లీలో మహిళల గురించి ధర్నా చేస్తుందట అని ఎద్దేవా చేశారు. కవిత మహిళా ద్రోహి అని, ఆమెకు మహిళల ఉసురు తగలడం ఖాయమని అన్నారు.

గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం దారుణమని ప్రభాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఏడడుగులు వేసి రాజ్ భవన్ కు వెళ్లి, గవర్నర్ కు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తే అన్ని బిల్లులు ఓకే అవుతాయని అన్నారు. కేవలం రాజకీయాల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని జోస్యం చెప్పారు.

Related posts

ఏపీ లో చమురు ధరలు తగ్గించాలని టీడీపీ ఆందోళ‌న‌లు.. ప‌లువురు నేత‌ల అరెస్టు!

Drukpadam

ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదేనా?

Drukpadam

విరాళాల రూపంలో బీజేపీపై వందల కోట్ల వర్షం!

Drukpadam

Leave a Comment