Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ …ఏపీకి పెట్టుబడుల వెల్లువ…

విశాఖ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ …ఏపీకి పెట్టుబడుల వెల్లువ…
-సమ్మిట్ కు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు
-మొత్తం 340 ఎం ఓ యూ లు …13 లక్షల పెట్టుబడులు …6 లక్షలమందికి ఉపాధి అవకాశాలు
-ఇది నిర్వాహకులు ఊహించినదానికంటే అనేక రేట్లు ఎక్కువని అభిప్రాయం …
-ఏపీ పెట్టుబడులకు మంచి అవకాశం ఉందన్న ముకేశ్ అంబానీ
-తమ పెట్టుబడులు కొనసాగుతాయని అదానీ గ్రూప్ వెల్లడి
-ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందన్న కేంద్రమంత్రి గడ్కరీ

ఏపీ లోని విశాఖలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలు హాజరైయ్యారు . రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 15 వేలమందికి పైగా వచ్చారని అంచనా … 13 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు …340 సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు . ఇంతమంది వచ్చి తన వెన్ను దట్టి ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వాములు అవుతామని చెప్పడంపట్ల ఆయన ఆనందానికి అవధులు లేవు …రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకొని పోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు .

దేశంలోని అత్యంత సంపన్నలుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు వారి ప్రతినిధులు హాజరు కావడం రాష్ట్ర స్వరూప స్వభావాన్ని మార్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు … పాల్గొన్న వారిలో ముఖేష్ అంబానీ , కరుణ్ అదానీ , జిందాల్ , జీఎం రావు , మోహన్ రెడ్డి, కియా మోటార్ ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు . వారి ప్రసంగాల్లో దేశంలోనే ఎక్కువ కోస్టల్ కారిడార్ 974 ఉండటం , పోర్టులు , రోడ్లు , విమాశ్రయాలు కలిగే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రం ఏపీ అని కొనియాడారు .

ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది….కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు .రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు .ఇందుకు 20 కోట్లు అందిస్తామని అన్నారు.  ఏపీకి అనుసంధానంగా మూడు కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు . వీటిలో చెన్నై విశాఖ , బెంగుళూరు చెన్నై , విజయవాడ ,హైద్రాబాద్ కారిడార్లు ఉన్నట్లు పేర్కొన్నారు .

Related posts

Vijaya baite

Drukpadam

న‌వంబ‌ర్‌లో మునుగోడు ఉప ఎన్నిక‌: బీజేపీ నేత సునీల్ బ‌న్స‌ల్‌!

Drukpadam

తనపై ఎన్టీఆర్ మనిషిగా ముద్ర.. అందుకు గర్విస్తున్నా …చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

Drukpadam

Leave a Comment