Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మళ్లీ అదే సీన్.. విమానంలో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన!

మళ్లీ అదే సీన్.. విమానంలో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన!

  • అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెలుగు చూసిన ఘటన
  • మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై విద్యార్థి మూత్ర విసర్జన
  • విద్యార్థి కెరీర్ పాడవుతుందని ఫిర్యాదు చేసేందుకు బాధితుడి విముఖత
  • విమాన సిబ్బంది ఫిర్యాదుతో విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక మునుపే అలాంటి మరో వివాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ‘‘తాగిన మైకంలో ఉన్న ఓ విద్యార్థి మూత్ర విసర్జన చేశాడు. ఈ క్రమంలో అది తోటి ప్రయాణికుడిపై పడింది’’ అని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. నిందితుడు ఓ అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. 

బాధితుడికి ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పడంతో అతడి కెరీర్‌ పాడవకూడదనే ఉద్దేశంతో అతడిపై ఫిర్యాదు చేయలేదు. అయితే.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన విమాన సిబ్బంది.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో విమానం ఢిల్లీలో దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 

‘‘మూత్ర విసర్జన ఘటన వెలుగులోకి రాగానే ఎయిర్‌లైన్స్ భద్రతా సిబ్బంది, సీఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానం ఎయిర్‌పోర్టులో దిగగానే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు’’ అని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. 

పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినట్టు రుజువైతే నిందితులపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. నిందితులపై విమానప్రయాణాలు చేయకుండా కొంతకాలం పాటు నిషేధం విధిస్తారు.

Related posts

ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్లను కాల్చి చంపిన తమిళనాడు పోలీసులు

Ram Narayana

పాకిస్థాన్‌లో పరువు హత్య: మోడలింగ్ చేస్తోందని సోదరిని కాల్చి చంపిన అన్న!

Drukpadam

సెక్స్ వర్కర్ ముసుగులో విటులను ఆకర్షించి దోపిడీకి పాల్పడుతున్న మహిళ

Ram Narayana

Leave a Comment