Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

లండన్ వేదికగా కేంద్రంపై మరోసారి విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!

లండన్ వేదికగా కేంద్రంపై మరోసారి విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!

  • ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తో మాట్లాడిన రాహుల్
  • భారత్ లో ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు
  • బీబీసీకి ఎదురైన పరిస్థితి ఆ కోవలోకే వస్తుందని వెల్లడి

బ్రిటన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. లండన్ లో ఆయన ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ)తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ లో కొత్త సిద్ధాంతం అమలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారని రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకోకపోతే ఇలాగే జరుగుతుందని, బీబీసీకి ఎదురైన పరిస్థితి కూడా ఆ కోవలోకే వస్తుందని వివరించారు. గత 9 ఏళ్లుగా భారత్ లో ఉన్న పరిస్థితి ఇదేనని స్పష్టం చేశారు.

భారత్ లోని దళితులు, బలహీన సామాజిక వర్గాల ప్రజలు నోరెత్తకూడదని బీజేపీ భావిస్తోందని, దేశ సంపదనంతా నలుగురైదుగురికి పంచాలని ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

కొన్నిరోజుల కిందట కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగం సందర్భంగానూ రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భారత్ లో మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా చూస్తున్నారని విమర్శించారు.

Related posts

గుజరాత్ ఓట్లతో ఆప్ కు జాతీయ పార్టీ హోదా!

Drukpadam

బీజేపీలో గందరగోళం…కొత్తగా వచ్చిన వారిని నిలబెట్టుకునేందుకు పదవుల పందారం …

Drukpadam

హుజురాబాద్ ఓటమితో సహనంకోల్పోయిన కేసీఆర్ …పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శ!

Drukpadam

Leave a Comment