Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దారి కోసం వెతుకులాటా? తనపై వచ్చిన ఆరోపణలపై వివరణా?ఈటల రాజకీయ నేతలను కలవడం పై పెరుగుతున్న ఆశక్తి

దారి కోసం వెతుకులాటా? తనపై వచ్చిన ఆరోపణలపై వివరణా?
-ఈటల రాజకీయ నేతలను కలవడం పై పెరుగుతున్న ఆశక్తి
-రోజుకో నేత‌తో భేటీ అవుతూ ఈట‌ల రాజేంద‌ర్ బిజీ!
-ఇప్ప‌టికే భట్టి విక్ర‌మార్క‌తో భేటీ
-నేడు ఎంపీ డీఎస్‌తో స‌మావేశం
-గంట‌న్న‌ర చ‌ర్చించిన వైనం
-త్వ‌ర‌లోనే భవిష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌క‌ట‌న‌
రోజుకో నేత‌తో భేటీ అవుతూ తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బిజీగా ఉంటున్నారు. ఈ భేటీలతో ఆయన ఏమి ఆశిస్తున్నారు. కలిసిన లీడర్లతో ఏమి చర్చిస్తున్నారు. దారికోసం ఎతుక్కుంటున్నారా ? తనపై వచ్చిన ఆరోపణలపై వివరణా విస్తున్నారా ? అనే ఆశక్తి నెలకొన్నది .మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయినతరువాత ఆయన ఇప్పుడు క్రాస్ రోడ్ లో ఉన్నారు. తనదారికోసం చూస్తున్నారు. ఏ దారి వెళ్ళితే తనకు భవిషత్ ఉంటుందో తేల్చుకోలేక పోతున్నారు.రాజీకీయాలకు అతీతంగా కమ్యూనిస్టులు మినహా అన్ని పార్టీలు ఆయన విషయం లో స్పందించాయి. సానుభూతి చూపాయి. కావాలని ఆయనపై భూకబ్జా ఆరోపణలు కేసీఆర్ ప్రభుత్వం చేసింది అనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ,బీజేపీలు మాత్రం అయన తమ పార్టీలోకి వస్తే మంచిదని సలహాలు ఇస్తున్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డి మాత్రం కేసీఆర్ వ్యతిరేక ప్లాట్ ఫారం లోకి ఆయనను తీసుకురావాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఆయన అందరి నాయకుల్లాగా ఎక్కడ ఆవేశాలకు వెళ్లడంలేదు. ఆచితూచి మాట్లాడుతున్నారు. నాయకులను కలుస్తున్నా ఎక్కడ వారితో సైతం వారి పార్టీలలోకి వస్తానని హామీ ఇచ్చిన దాఖలాలు లేవు . అయితే ఆయన ఇప్పటికి టీఆర్ యస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇంకా ఆయన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు . పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన్ను సస్పెండ్ చేయడం పార్టీకి క్షణం పని కానీ వారు కూడా అది చేయడంలేదు. దీంతో ఈటల ఎపిసోడ్ ఎటు దారి తీస్తుంది .ఆయన ఇంకా ఎవరెవరిని కలువనున్నారు. చివరకు ఎటు వెళ్లనున్నారు. అనే ఆశక్తి నెలకొన్నది

ఆయ‌న‌పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంత‌రం ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ నేప‌థ్యంలో మొద‌ట‌ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలతో చర్చలు జ‌రిపిన ఈట‌ల‌… నిన్న‌ హైద‌రాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. ఈ రోజు ఎంపీ డి.శ్రీనివాస్‌తో ఆయన సమావేశం అయ్యారు. వీరిద్దరూ దాదాపు గంటన్నరకు పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే ర‌వీంద‌ర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. త‌న‌ భవిష్యత్తు రాజకీయాలపై ఈట‌ల‌ చర్చించినట్టు తెలుస్తోంది. అక్క‌డే డీఎస్ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కూడా ఈటల రాజేంద‌ర్ క‌ల‌వడం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే ఈట‌ల త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Related posts

నేటితో మున్సిపోల్ ప్రచారం బందు…

Drukpadam

మళ్ళీ కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట …

Drukpadam

ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు నడుం బిగించిన కేసీఆర్!

Drukpadam

Leave a Comment