Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

జాతరలో అందరూ చూస్తుండగానే అల్లుడిని నరికి చంపిన మామ…

కర్నూలులో దారుణం.. జాతరలో అందరూ చూస్తుండగానే అల్లుడిని నరికి చంపిన మామ…

  • పి.కోటకొండలో పట్టపగలే ఘటన
  • ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు
  • అల్లుడి హత్యకు ముందే పథకం
  • పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ దారుణం

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. జాతరకొచ్చిన అల్లుడిని అందరూ చూస్తుండగానే మామ కత్తితో నరికి చంపాడు. దేవనకొండ మండలం పి.కోటకొండలో పట్టపగలే జరిగిన ఈ ఘటనతో జాతరకొచ్చిన వారు భయభ్రాంతులకు గురయ్యారు.

గ్రామానికి చెందిన లింగమయ్య, అతడి అల్లుడు సూర్యప్రకాశ్ (23) మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న జాతరకొచ్చిన అల్లుడిపై లింగమయ్య కత్తులతో దాడిచేశాడు. అల్లుడి హత్యకు ముందే ప్లాన్ చేసుకున్న లింగమయ్య కత్తులతోనే జాతరకొచ్చాడు.

బందోబస్తు ఉన్నప్పటికీ..
జాతరలో సూర్యప్రకాశ్ కనిపించగానే లింగమయ్య ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డాడు. అందరూ చూస్తుండగానే అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సూర్యప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. జాతర కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లింగమయ్యను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Related posts

ఐదేళ్ల చిన్నారిపై దారుణం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు!

Ram Narayana

Ram Narayana

తమిళ సినీ నటుడి బ్యాగు నిండా బుల్లెట్లే… విమానం ఎక్కేందుకు నిరాకరించిన అధికారులు…

Ram Narayana

Leave a Comment