సోనియా గాంధీ కి శాల్యూట్ …మోడీపై నిప్పులు ఢిల్లీ ప్రెస్ మీట్ లో బీఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత…
-లిక్కర్ స్కాం లో 11 న హాజరవుతానన్న కవిత విజ్ఞప్తికి ఈడీ ఒకే
-నాకేం భయం.. విచారణకు హాజరవుతానని వెల్లడి
-రేపు ధర్నా కార్యక్రమం ఉండడంతో సమయం కోరానని వెల్లడి
-అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబిస్తానని చెప్పిన ఎమ్మెల్సీ
-దీక్షకు అనుమతి నిరాకరణ అంటూ కవితకు కబురు …
బీఆర్ యస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా బిల్లుపై మాట్లాడుతూ గతంలో ఇందుకు చొరవచూపిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి శాల్యూట్ చేస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు . అదే సందర్భంలో ప్రధాని నరేద్రమోడిపై నిప్పులు చెరిగారు . ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పినమాటలను నెరవేర్చకపోవడంపై విమర్శలు గుప్పించారు . 1996 నుంచి వివిధ పార్టీలు సంఘాలు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజెర్వేషన్లు కావాలని చేస్తున్న డిమాండ్ ఎందుకు నెరవేర్చలేదు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు .
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమె పాత్ర ఉందని చెపుతున్న ఈడీ ఈనెల 9 న ఢిల్లీలో హాజరు కావాలని నోటీసులు పంపిందని తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున రాలేనని ఈడీకి తెలియజేశామని ఈనెల 15 హాజరవుతానని చెప్పనప్పటికీ 11 రావాలని ఆదేశించారని అన్నారు . 11 వెళతానని విచారణకు వెళ్లేందుకు తనకు ఎలాంటి భయం లేదని చెప్పారు . ఆస్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు . ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరిపినా తనకు ఇబ్బందిలేదన్నారు. కేంద్ర విచారణ సంస్థలకు 100 శాతం సహకరిస్తానని, అధికారులు అడిగే ప్రశ్నలు అన్నింటికీ జవాబిస్తానని వివరించారు.
1996 నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లోనే ఉందని, కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మోక్షం కలగడంలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో తగిన మెజారిటీ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మెదీ మర్చిపోయారని ఆరోపించారు.
2018లోనూ మరోమారు ఈ బిల్లును పాస్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని కవిత విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ సమయం ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికైనా పాస్ చేయాలని కోరారు. ఈ విషయంలో కల్పించుకోవాలని, బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు చొరవ చూపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్ష పార్టీలే లక్ష్యం గా ఎన్ఫోర్స్ మెంట్ సంస్థల దాడులు
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా ఈడీ , ఇంకమ్ ట్యాక్స్ , సిబిఐ దాడులు జరుపుతున్నామని ఒక్క తెలంగాణాలోనే 500 దాడులు జరిగాయని అన్నారు . తమ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ,ఎమ్మెల్యేలపై దాడులు చేసిన విషయాన్నీ ఆమె గుర్తు చేశారు .
ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షలో విపక్షాల
పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం కవిత దీక్ష చేపట్టనున్నారు. ఆమె దీక్షకు దేశ వ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు దీక్షకు హాజరవుతారని తెలుస్తోంది.
ఇక ఈ దీక్షలో విపక్షాలు జంతర్ మంతర్ వేదికగా బల ప్రదర్శనకు దిగనున్నాయి. దీక్షకు హాజరై సంఘీభావం తెలపనున్న పార్టీల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, పీడీపీ, అకాలీదళ్, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీతో పాటు వామ పక్షపార్టీల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో కవిత ఈ కార్యక్రమం చేపట్టారు.
కవిత దీక్షకు హాజరు కానున్న 18 పార్టీలు
మరోవైపు మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆమె రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నారు. దీక్షను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారు . ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతుంది. 18 పార్టీలకు చెందిన ప్రతినిధులు , 30 కి పైగా సంఘాలు ఇందులో పాల్గొంటాయి . కాంగ్రెస్ పార్టీని కూడా ఈదీక్షలకు ఆహ్వానించడం జరిగిందని ఆమె తెలిపారు . బీఆర్ యస్ పార్టీ బీజేపీకి “బి” టీం అనే విమర్శలపై ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె ఘాటుగా స్పందించారు . కాంగ్రెస్ కూడా ప్రాంతీయపార్టీలు స్థాయికి దిగజారింది 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు కాంగ్రెస్ తన అహంకారాన్ని తగ్గించుకొని అన్ని పార్టీలను ఐక్యం చేయాలనీ అన్నారు . అప్పడు ఎవరిదీ ఏ టీమో తెలుస్తుందని అన్నారు . సోనియా గాంధీ ఈదీక్షలకు హాజరైయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఆమె పెద్ద నాయకురాలు , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని ఆహ్వానించాం వారు ఎవరిని పంపిస్తారని తెలియదని జవాబు ఇచ్చారు . ఆమె మీడియా సమావేశంలో ఉండగానే రేపు జంతర్ మంతర్ వద్ద జరుపతలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారని ఆమె కు కబురు వచ్చింది. దానిపై స్పందించలేదు …