Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాస్ రావు బదిలీ… నెరవేరిన సిపిఐ కోరిక…

ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాస్ రావు బదిలీ… నెరవేరిన సిపిఐ కోరిక…
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని , రాష్ట్ర నాయకులు భాగం పై కేసులు
-రూరల్ సీఐ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ మండిపాటు
-తమ జిల్లా సహాయకార్యదర్శి దండి సురేష్ ను బెదిరించారని ఆరోపణలు
-సీఐ బదిలీపై పట్టుబట్టిన సిపిఐ …డీజీపీ ని కలిసి విజ్ఞప్తి
-డిపార్ట్మెంటల్ విచారణ చేసిన అధికారులు
-రూరల్ పోలీస్ స్టేషన్ ముట్టడికి సిపిఐ పిలుపు
-స్థానిక ఎమ్మెల్యే కందాల విజ్ఞప్తితో విరమించుకున్న ముట్టడి కార్యక్రమం …

ఖమ్మం రూరల్ సీఐ ఎం శ్రీనివాస్ రావు ఎట్టకేలకు బదిలీ కావడంతో సిపిఐ కోరిక నెరవేరునట్లు అయింది . శ్రీనివాస్ రావు బదిలీ అయి ఆయన స్థానంలో రాజిరెడ్డి సీఐ గా ఇక్కడకు వస్తున్నారు . సిపిఐ వత్తిడితో ఎప్పుడో జరగాల్సిన బదిలీ ఆలశ్యం అయింది . మొత్తం 21 మంది సీఐ బదీలలను చేసిన డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లాలోని 4 గురు సీఐ లను బదిలీ చేశారు .వారిలో ఖమ్మం వన్ టౌన్ , త్రి టౌన్ , రూరల్ ,ఖానాపురం హవేలీ సీఐ లు బదిలీ అయ్యారు . అయితే ఎట్టకేలకు ఖమ్మం రూరల్ సీఐ బదిలీ సిపిఐ ఖాతాలో పడుతుందా ? లేక సాధారణ బదిలీల్లో భాగమేనా …?అంతే సాధారణ బదిలీల్లో భాగమేనని అంటున్నారు ఉన్నతాధికారులు …అయితే సిపిఐ రూరల్ సీఐ ని బదిలీ చేయమని కోరిన మాట నిజమేనని అందుకు రాజకీయపరమైన వత్తిడి కూడా వచ్చిందని అయితే కొంత సమయం తీసుకుని సాధారణ బదిలీల్లో భాగంగా చేయాల్సి వచ్చిందని అంటున్నారు .

ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాస్ రావు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ను బెదిరించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు వరంగల్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన సభలో హెచ్చరికలు చేశారు . దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు . సీఐ చర్యలను నిరసిస్తూ ఆయన్ను బదిలీ చేయాలనీ కోరుతూ సిపిఐ పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపు నిచ్చింది . అయితే స్థానిక శాసనసభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి సిపిఐ నాయకులతో మాట్లాడి వారి ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేయించారు . అయితే సిపిఐ నాయకులు ముట్టడి రద్దు చేసుకోలేదని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని ప్రకటించారు . సీఐ పై చర్యలకు సిపిఐ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకోని పోవడంతోపాటు , డీజీపీ కి ఫిర్యాదు చేసింది. పోలీస్ శాఖ డిపార్ట్మెంటల్ విచారణ కూడా జరిపింది. చివరకు శ్రీనివాస్ రావు బదిలీ జరిగింది….

జిల్లాలో బదిలీ అయిన సీఐ ల వివరాలు …

ఖమ్మం జిల్లా లో నలుగురు సిఐల బదిలీలు
ఖమ్మం వన్ టౌన్ ,3 టౌన్, ఖానాపురం హైవేలి, ఖమ్మం రూరల్ సిఐల బదిలీ
ఖమ్మం వన్ టౌన్ సీఐ గా -టి.స్వామి
ఖమ్మం త్రీ టౌన్ సీఐ గా -బత్తుల సత్యనారాయణ
ఖమ్మం అర్బన్ సీఐ గా- టి.శ్రీహరి
ఖమ్మం రూరల్ సీఐ గా- రాజిరెడ్డి రానున్నారు .

Related posts

నోరుజారిన రామ్ గోపాల్ వర్మ …వాతలు పెడతామన్న జివిఎల్ !

Drukpadam

సొంత ఊరికి మంచి చేయాలని భావించి… తిరిగిరాని లోకాలకు వెళ్లిన బిపిన్ రావత్!

Drukpadam

మోదీని నవ్వులపాలు చేసిన ఫొటో!

Drukpadam

Leave a Comment