కవితపై బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: బీజేపీ ఎంపీ అరవింద్
కవిత పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు …బీజేపీ ఎంపీ అరవింద్
బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పు పట్టిన సొంతపార్టీ ఎంపీ
- కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు
- బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
- ఆ వ్యాఖ్యలను తాను సమర్థించబోనన్న అరవింద్
- సామెతలు జాగ్రత్తగా ఉపయోగించాలని హితవు
ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని అరవింద్ పేర్కొన్నారు. అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదని, కోఆర్డినేషన్ సెంటర్ అని స్పష్టం చేశారు.
తెలంగాణ సంస్కృతిలో అనేక సామెతలు ఉంటాయని, సామెతలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలని బండి సంజయ్ కి హితవు పలికారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయని, ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు .
ఇక, ఈడీ విచారణకు కవిత సహకరిస్తే మంచిదని అరవింద్ అభిప్రాయపడ్డారు. లేకపోతే వీలైనంత త్వరలో కస్టడీలోకి తీసుకునే అవకాశముందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవిధంగా స్పందించారు.