Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైరా మున్సిపల్ సిబ్బందికి పెండింగ్ ఏరియర్స్ సోమ్ము చెల్లించాలని…సిపిఐ

వైరా మున్సిపల్ సిబ్బందికి పెండింగ్ ఏరియర్స్ సోమ్ము చెల్లించాలని…సిపిఐ
-ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ లో వినతి
-కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ …

మున్సిపల్ సిబ్బందికి పెండింగ్ ఏరియర్స్ చెల్లించడంలో వైరా పురపాలక సంఘం కాలయాపన చేయడంపై సిపిఐ మండిపాటు ..ఇది సరైన పద్దతి కాదని వెంటనే సిబ్బందికి రావాల్సిన పెండింగ్ ఏరియర్స్ సోమ్ము వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా కనీస వేతనాలు రూ. 24 వేలుగా పెంచాలని విజ్ఞప్తి చేశారు .ఈమేరకు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన గ్రీవెన్స్ నందు వైరా పురపాలక సంఘం సిబ్బందితో కలసి అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహాలత, జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు లకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరా పురపాలక సంఘం నందు అతికొద్ది వేతనాలు పొందుతూ వెట్టిచాకిరి బానిస భతుకులతో జీవితాలు గడుపుతున్న కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ 2021లో విడుదల చేసింది 2022‌ జనవరి 6 మరో జీ.ఓ నెం. 4ను మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులకు 30% పిట్ మెంట్ చెల్లించాలని 11వ పీఆర్సీ విడుదల అయిన నాటినుండి ఏరియర్స్ రూపంలో చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు. అట్టి జీ.ఓ. నెం. 4 అనుసరించి వైరా పురపాలక సంఘం సిబ్బందికి ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఏండ్లు గడచిన సిబ్బంది ఎదురు చూస్తున్నా ఏరియర్స్ సోమ్ము అందక సిబ్బంది గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు.

అదేవిధంగా ఆరోగ్యానికి రక్షణ పరికరాలు మున్సిపల్ సిబ్బందికి అందించడం లేదని అన్నారు. ఇయస్ఐ గుర్తుంపు కార్డులు ఇవ్వాలని క్యాజువల్ సెలవులు పండగ సెలవులు క్రమం తప్పకుండా అమలు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన అడిషనల్ కలెక్టర్ త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారని తెలిపారు. పెండింగ్ ఏరియర్స్ సోమ్ము, సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేపడతామని తెలిపారు.వినతి పత్రం అందజేసిన వారిలో ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కోపెల మధు, వైరా పురపాలక సంఘం ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పి. లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐదు గ్రామాల ప్రజల మనోభీష్టాన్ని గౌరవించి తెలంగాణాలో కలపాలి ..మంత్రి పువ్వాడ!

Drukpadam

ఈ సారీ సిట్టింగ్‌ల‌కు టికెట్లు.. 80 సీట్ల దాకా గెలుస్తాం: టీఆర్ఎస్ఎల్పీ భేటీలో కేసీఆర్‌!

Drukpadam

తెలంగాణాలో పొత్తులపై సిపిఐ కార్యదర్శి కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment