జిల్లాలకు సమన్వయ కర్తలను నియమించిన కేటీఆర్ …
మంత్రులు ఎమ్మెల్యేలతో కో ..ఆర్డినేషన్ చేసుకోవాలి
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక నాయకుల బృందాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిచారు .
భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలు, డా. బి అర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ మరియు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలలపాటు పార్టీ విస్తృతంగా చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈమేరకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున ఏర్పాటుచేసిన ఈ బృందం, జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు తమకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక మరియు అమలుపైన చర్చించాలని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని, ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలవారీగా ఇంఛార్జ్ ల పేర్లను ఆయన వెల్లడించారు .
- వనపర్తి, జోగులాంబ గద్వాల – శ్రీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు , ఎమ్మెల్సీ
- మేడ్చల్ – శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ
- కరీంనగర్, రాజన్న సిరిసిల్ల- శ్రీ బస్వరాజు సారయ్య , ఎమ్మెల్సీ
- నల్గొండ – శ్రీ కడియం శ్రీహరి , ఎమ్మెల్సీ
- వికారాబాద్ – శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ
- రంగారెడ్డి – శ్రీ ఎల్. రమణ , ఎమ్మెల్సీ.
- భద్రాద్రి కొత్తగూడెం – శ్రీ భానుప్రసాద్ , ఎమ్మెల్సీ
- సంగారెడ్డి – శ్రీ వెంకట్ రామ్ రెడ్డి , ఎమ్మెల్సీ
- మెదక్- శ్రీ ఎగ్గే మల్లేశం , ఎమ్మెల్సీ
- మహబూబ్ నగర్, నారాయణపేట – శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి , ఎమ్మెల్సీ
- యాదాద్రి భువనగిరి- శ్రీ డా. యాదవ రెడ్డి , ఎమ్మెల్సీ
- నాగర్ కర్నూల్- శ్రీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ
- భూపాలపల్లి, ములుగు శ్రీ అరికెల నర్సారెడ్డి , మాజీ ఎమ్మెల్సీ
- సిద్దిపేట శ్రీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ
- హనుమకొండ, వరంగల్ శ్రీ ఎమ్. ఎస్ ప్రభాకర్ , ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్
- నిర్మల్, ఆదిలాబాద్- శ్రీ వి. గంగాధర్ గౌడ్ , ఎమ్మెల్సీ
- మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ – శ్రీ నారదాసు లక్ష్మణ్ , మాజీ ఎమ్మెల్సీ
- జనగామ- శ్రీ కోటిరెడ్డి , ఎమ్మెల్సీ
- మహబూబాబాద్ – శ్రీ పురాణం సతీష్ , మాజీ ఎమ్మెల్సీ
- కామారెడ్డి- శ్రీ దండే విఠల్, ఎమ్మెల్సీ
- నిజామాబాద్ -శ్రీ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ
- జగిత్యాల – శ్రీ కోలేటి దామోదర్ , పార్టీ సెక్రెటరీ
- పెద్దపల్లి- శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ , కార్పొరేషన్ చైర్మన్
- హైదరాబాద్- శ్రీ డా. దాసోజు శ్రావణ్ , సీనియర్ నాయకులు
- ఖమ్మం – శ్రీ శేరి సుభాష్ రెడ్డి , ఎమ్మెల్సీ
- సూర్యాపేట- శ్రీ మెట్టు శ్రీనివాస్ , కార్పొరేషన్ ఛైర్మన్