Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి జర భద్రం….అతి విశ్వాసం పనికిరాదు…

పొంగులేటి జర భద్రం విశ్వాసం ఉండాలేగాని ,అతివిశ్వాసం పనికి రాదు
ఆయన సాగదీతపై నాయకుల్లో నిరుత్సాహం
దయానంద్ దూరం పై దుమారం
అదే దారిలో మరికొందరు నేతలు ….?
కొందరి నేతలపై బీఆర్ యస్ గురి…!
బీఆర్ యస్ ను డౌకవుట్ చేస్తామంటున్నపొంగులేటి శిభిరం
సిక్సర్లు ,ఫోర్ లతో చెలరేగుతామని నమ్మకం అది జరిగే పనేనా …?

రాజకీయాల్లో దూకుడు ఉండాలితెగింపు రాజకీయాలు అవసరంఅయితే రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలనే సూత్రాన్ని పొంగులేటి తూచా తప్పకుండ పాటిస్తున్నారు .కానీ అందులో వేసే అడుగులు జర భద్రంగా ఉండాలిరాజకీయాల్లో విశ్వాసం అవసరమే గానీ అతి విశ్వాసం పనికి రాదుఏపార్టీ లో చేరినప్పటికీ నిర్ణయంలో జాప్యం పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. … సాగదీయడం తగదని అనుయాయులు సలహాలు ఇస్తున్నారు . ఇప్పటికే పొంగులేటి ఒక నిర్ణయం తీసుకున్నారని అందువల్లనే మొదటి నుంచి ఆయనకు ముఖ్యఅనుచరుడుగా ఉన్న మట్టా దయానంద్ ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై దుమారం రేగుతుంది . మరికొందరు నేతలను కూడా ఆయనకు దూరం చేయడం ద్వారా పొంగులేటి శిబిరాన్ని బలహీనపరచాలని , దెబ్బతీయాలని, బీఆర్ యస్ ఎత్తులు వేస్తుంది. ఇప్పటివరకు ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు . ప్రజల్లో పట్టున్న నేతగా ఉన్న పొంగులేటి వేసే అడుగులు ఆయన రాజకీయ భవిష్యత్ ను నిర్ణయిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేదానిపై సర్వత్రా
అసక్తి నెలకొన్నది .

పొంగులేటి బీఆర్ యస్ కు దూరమై దాదాపు మూడునెలలు పైగానే అయింది. అంతకుముందు కూడా అసమ్మతినేతగానే ఉన్నారు .అయితే ఆయన్ను పార్టీలో కొనసాగేలా చేయాలనీ కేటీఆర్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదుఅందుకు అనేక ఆటకంకాలు ఏర్పడ్డాయి. పార్టీలో కనీసం గౌరవం ,గుర్తింపు లేకపోవడం ఆయన్ను మనస్తాపానికి గురిచేసింది . దీంతో కేసీఆర్ ను ఎదిరించి నిలిచాడు . ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నారు . ఫలితంగా బీఆర్ యస్ కూడా ఆయన్ను ఒంటరి చేయాలనీ రాజకీయంగా దెబ్బతీయాలని ఎత్తులు వేస్తుంది. ఎవరికీ వారు పైచేయి సాదించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు .

ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ఆత్మీయసమ్మేళనాలు పెట్టారు . వీటికి భారీగానే ప్రజలు తరలి వచ్చారు . పార్టీలో ఉన్నప్పుడు కూడా నిత్యం ఏదోఒక పేరుతో ప్రజల్లో ఉన్నారు . అందువల్ల ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది . అయితే ఆయన ఏపార్టీ లో చేరేది చెప్పనప్పటికీ ఆయన నిర్ణయంపై జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు . పార్టీలో చేరే విషయంలో సాగదీస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనివల్ల ఆయనకు లాభం అనుకుంటున్నారేమో గానీ కచ్చితంగా నష్టం జరుగుతుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం . పొంగులేటి ఆలోచనలు ఏమిటి ? అసలు ఆయన ఏపార్టీలో చేరాలని అనుకుంటున్నారు . ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం నిజమేనా ? అందుకే సత్తుపల్లి లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పొంగులేటి ముఖ్య అనుచరుడు దయానంద్ దూరంగా ఉన్నారనే ప్రచారం జాగుతుందిదీనిపై పొంగులేటి క్యాంపు ఎలాంటి ప్రకటన చేయలేదు .అదే సందర్భంలో పిడమర్తి రవి కూడా పొంగులేటికి దూరమైయ్యారని ప్రచారం జరుగుతున్న వేళ మంగళవారం ఖమ్మంలో జరిగిన పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిడమర్తి రవి పాల్గొని తన ప్రయాణం పొంగులేటి వెంటేనని చెప్పారు.

బీజేపీ వైపు ఆయన చూస్తున్నారని అయితే దానివల్ల బీజేపీకి ప్రయోజనం జరుగుతుంది తప్ప పొంగులేటి రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చునని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . చాలామంది ఆయన హితులు ,సన్నిహితులు బీజేపీలో పొంగులేటి చేరికపై తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు . దీనివల్ల బీఆర్ యస్ కే ప్రయోజనం తప్ప పొంగులేటికి గాని బీజేపీకి గాని ఉపయోగం ఉండదనే అభిప్రాయాలే బలంగా వినిపిస్తున్నాయి. పొంగులేటి అనుయాయులు మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాలో బీఆర్ యస్ ను డౌకవుట్ చేస్తామని తాము సిక్సర్లతో చెలరేగుతామని చెప్పడం అత్యాశే అవుతుందని ముందు వారు డౌకవుట్ కాకుండా చూసుకోవాలని అంటున్నారు పరిశీలకులుచూద్దాం ఏమి జరుగుతుందో ….!

Related posts

కొడుకు స్థానంలో పోటీ పడనున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య!

Drukpadam

రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ సాధ్యమేనా….?

Drukpadam

పీసీసీ చీఫ్ రేవంత్ పై టీఆర్ యస్ నేతల భగ్గుభగ్గు…

Drukpadam

Leave a Comment