Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భట్టి పాదయాత్ర కాంగ్రెస్ లో జోష్ నింపుతుందా ….?

భట్టి పాదయాత్ర కాంగ్రెస్ లో జోష్ నింపుతుందా ….?
-పిప్పరి నుంచి ప్రారంభం కానున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
-భారీ బహిరంగసభకు ఏర్పాట్లు
-నాడు వైయస్సార్ నేడు భట్టి పంచెకట్టుతో పాదయాత్ర
-రాహుల్ జోడో యాత్రకు కొనసాగింపుగానే హత్ సే హత్ జోడో యాత్ర
-పాల్గొననున్న సీనియర్ నేతలు ..
-ఏఐసీసీ పర్వేక్షణలోనే భట్టి యాత్ర …

తెలంగాణాలో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకోని రావాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా కార్యాచరణకు నడుంబిగించింది …ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తుండగా ,మరో వైపు బుధవారం నుంచి సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భట్టి పాదయాత్ర పార్టీలో జోష్ నింపుతుందా …?అంటే కచ్చితంగా నింపుతుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు .. ఏఐసీసీ పర్వవేక్షణలో భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జరగనున్న భట్టి హత్ సే హత్ జోడో యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులంతా పాల్గొనేందుకు సిద్దపడుతున్నారు . భట్టి సైతం ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.నాయకులందరినీ ఇకతాటిపైకి తీసుకోని ఇచ్చేందుకు అందరికి కలిశారు .తన యాత్రలో పాల్గొనాలని మద్దతు తెలపాలని కోరారు . అందుకు సీనియర్ల నుంచి స్పందన రావడం సంతోషంగా ఉందని భట్టి అంటున్నారు . ఇద్దరు రాష్ట్ర ముఖ్యనేతల యాత్రల ద్వారా కాంగ్రెస్ లోని గ్రూప్ తగాదాలను తగ్గించడంతోపాటు , ఎన్నికల్లో కలిసి కట్టుగా వెళ్లేలా చూడాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది.

మండు వేసవిలో భట్టి మొదలు పెడుతున్న పాదయాత్ర… నాడు
వైయస్సార్ లాగానే అదే పంచకట్టు…అదే ఆహార్యంతో సాగనుండటం ప్రత్యేకతగా నిలవనుంది …ఈనెల 16 నుండి అదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పిప్పిరి గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర 100 రోజులు 39 నియోజకవర్గాల్లో కొనసాగనున్నది …

పిప్పిరి లో పాదయాత్ర ప్రారంభానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు …మంచిర్యాలలో లక్ష మందితో భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి .

కాంగ్రెస్ పార్టీ విధానాలను, సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఏఐసీసీ ఆదేశాలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న ఈయాత్ర కు తెలంగాణ ఇంచార్జీ కనుసన్నల్లో జరుగుతుంది . పాదయాత్ర బహిరంగ సభలకు కాంగ్రెస్…జాతీయ అధ్యక్షులు ఖర్గే, ప్రియాంకా గాంధీ,కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రానున్నట్లు సమాచారం…

ఖమ్మంలో ముగింపు సభకు రాహుల్, సోనియా వచ్చే అవకాశం

మూడు నెలల భట్టి పాదయాత్రలో ముగుంపుగా ఖమ్మం లో భారీ బహిరంగసభ జరపాలని నిర్ణయించారు . ఈసభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి .

కేసీఆర్ పాలనలో నిర్వీర్యం అవుతున్న తెలంగాణ ప్రజల లక్ష్యాలు, ఆశలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవ అంశాలే ఎజెండాగా తన పాదయాత్ర సాగుతుందని భట్టి విక్రమార్క పేర్కొంటున్నారు .తెలంగాణ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు నేరవేరడం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకే కాంగ్రెస్ ను గెలిపించాలని పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు భట్టి తెలిపారు .

1300 కి .మీ పైగా సాగె ఈయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు . మూడు చోట్ల బహిరంగసభలు ఉంటాయి. దీనికి పార్టీ అగ్రనేతలు రానున్నారు. ఈ యాత్రలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Related posts

కాంగ్రెస్ పార్టీకి నిన్న గులాంనబీ ఆజాద్ ,నేడు ఎంఏ ఖాన్ రాజీనామా!

Drukpadam

కేసీఆర్ మీడియా సమావేశంపై బండి సంజయ్ ఆగ్రహం …

Drukpadam

కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు: సీపీఐ నారాయణ

Drukpadam

Leave a Comment