Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ బ్రిటన్ లో ప్రసంగంపై వివరణకు బీజేపీ నో …

దేశానికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు: రాహుల్ గాంధీ

  • ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరైన రాహుల్ 
  • భారత ప్రజాస్వామ్యంపై విదేశాల్లో చేసిన వ్యాఖ్యలపై దుమారం
  • తనకు అవకాశం ఇస్తే దీనిపై పార్లమెంటులో మాట్లాడతానన్న కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్ పర్యటన చేశారు . ఆ సందర్భంగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు . బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు . ఈసందర్భంగా భారత్ లో జరుగుతున్న పరిణామాలు , ప్రభుత్వ తీరుతెన్నులపై ప్రసంగించారు. ఇక్కడ ప్రజాస్వామ్యం అణిచివేయబడుతుందని విమర్శలు చేశారు .దీనిపై పార్లమెంట్ లో బీజేపీపై రాహుల్ గాంధీ ఇండియా గురించి చేసిన కామెంట్లపై క్షమాపణలు చెప్పాలని రెండు రోజులుగా డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ మాటల్లో ఎలాంటి తప్పులేదని చెప్పినప్పటికీ ఆయనపై విమర్శల దాడి మొదలు పెట్టింది. రాహుల్ గురువారం పార్లమెంట్ కు వచ్చారు . బ్రిటన్ లో తన మాట్లాడినదానిపై వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు . అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు .

 

విదేశీ పర్యటన సందర్భంగా భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై పార్లమెంటు దద్దరిల్లుతోంది. రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అధికార బీజేపీ డిమాండ్ చేస్తోంది. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. అదానీ అంశాన్ని దాటవేసేందుకే ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతిస్తే పార్లమెంటులో మాట్లాడతానని చెప్పారు. అక్కడ అవకాశం ఇవ్వకపోతే పార్లమెంటు బయట మాట్లాడతానని తెలిపారు. కాగా, ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

Related posts

కావాలనే పార్లమెంట్​ సమావేశాలకు అడ్డంకులు: కాంగ్రెస్​ తీరుపై ప్రధాని మండిపాటు

Drukpadam

కాంగ్రెస్‌ తో 46 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్!

Drukpadam

తీహార్ జైలులో పెట్టినా సరే పోటీ చేస్తా.. గెలుస్తా: భూమా అఖిలప్రియ..!

Drukpadam

Leave a Comment