ఇది రైతు ప్రభుత్వం …దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10 వేలు ఇస్తాం:కేసీఆర్
కేసీఆర్ వెంట సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని ,కూనంనేని
మంత్రులు నిరంజన్ రెడ్డి , పువ్వాడ అజయ్ , ఎమ్మెల్సీలు పల్లా ,తాతా
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
ఎమ్మెల్యేలు సండ్ర , రాములు నాయక్ , కందాల, జడ్పీ చైర్మన్ లింగాల
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి , జిల్లా కలెక్టర్ గౌతమ్
వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్
రాష్ట్రంలో 2 లక్షల ,28 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడి
ఇందుకు 228 కోట్ల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం ..
రైతులను ఆదుకోవడంలో కేంద్రప్రభుత్వం వైఖరిపై మండిపడ్డ కేసీఆర్
కేంద్ర సహాయం అడగబోమని స్పష్టికరణ …అక్కడ దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని మండిపాటు …
వాళ్లకు చెపితే దొంగలు పడ్డ ఆరునెలలకు వస్తారని ఎద్దేవా
ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాలకు , వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటపొలాలను స్వయంగా పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ గురువారం రాష్ట్రంలోని 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు . ఈసందర్భంగా ఆయన మొదట ఖమ్మం జిల్లాలో పంటలు బాగా దెబ్బతిన్న మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం రావినూతల , గార్లపాడు గ్రామాలను సందర్శించారు . ఆయన వెంట రాష్ట్ర వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ,సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం , కూనంనేని సాంబశివరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి , తాతా మధు , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి , లావుడ్య రాములు నాయక్ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మాజీ శాసన సభ్యులు డాక్టర్ చంద్రావతి , మదన్ లాల్ , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి , జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు .
పంటలు దెబ్బతిన్న రైతులను తప్పకుండ ఆదుకుంటామని ,రైతులు ఆధైర్యపడొద్దని సీఎం అభయం ఇచ్చారు సీఎం కేసీఆర్ . రాష్ట్రంలో 2 లక్షల 28 వేళ ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారని అందువల్ల , ప్రతి ఎకరాకు సహాయం అందజేస్తామని అన్నారు . ఎకరాకు 10 వేల రూపాయల సహాయం అందిస్తామని ప్రకటించారు …కౌలు రైతులకు కూడా మేలు చేస్తాం మని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు . పంటకు పెట్టిన పెట్టుబడులు , దిగుబడి ద్వారా వచ్చే ఆదాయం గురించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు . అక్కడకు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లు కూడా రైతుల పంట నష్టం పై సీఎం కు వివరించారు . రైతులకు చేయాల్సిన సహాయంపై సీఎం కు వివరించారు . సీఎం వారు చెప్పిన మాటలను కూడా జాగ్రత్తగా ఆలకించారు.తప్పకుండ చేస్తామని అన్నారు .
పంటల పరిశీలన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ కేంద్రం విపత్తుల సందర్భంగా రైతులను ఆదుకోవాలని, కానీ అది చేయడంలేదని,రాజకీయాలు చేస్తుందని , అందువల్ల వారిని సహాయం గురించి అభ్యర్థించబోమని అన్నారు . ఒక వేళ వాళ్లకు చెప్పినా, దొంగలు పడ్డ ఆరునెల్లకు వచ్చినట్లు వస్తారని కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు .
తర్వాత మహబూబ్ బాద్, జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రెడ్డి కుంట తండా , వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ,కరీంనగర్ జిల్లలో పర్యటించిన కేసీఆర్ రైతులకు దైర్యం చెప్పారు . మనది రైతు ప్రభుత్వమని రైతుల కష్టాలు తమ కష్టాలని అన్నారు . వ్యవసాయంలో తనకు కూడా అనుభం ఉందని అందువల్ల తప్పకుండ ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు చెప్పారు . ఈ పర్యటనలో ఆయా జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ , సత్యవతి రాథోడ్ , గంగుల కమలాకర్ ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు .