Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల కొంత సమయం ఆగాల్సి వస్తుంది. అయితే టోల్ గేట్ వద్ద ఆగి.. టోల్ ఫీజు చెల్లించే పని ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

జాతీయ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు టోల్ గేట్ వద్ద ఆగి టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఒక్కోసారి భారీగా ట్రాఫిక్ అవుతుంది. ఈ సమస్యను అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా వాహనదారులు ముందుగానే రీఛార్జ్ చేసుకుని ఉండడం వల్ల చెల్లింపులు త్వరగా అయిపోతాయి. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. అయితే ఇక నుంచి ఆ సమయం కూడా వెచ్చించాల్సిన పని లేదని కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు టోల్ గేట్ వద్ద ఆగి.. ఫాస్టాగ్ ద్వారానో లేక మామూలుగానో టోల్ ట్యాక్స్ చెల్లించే పని లేదు.

జాతీయ రహదారిపై టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీవెల్లడించారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా కేవలం వాహనదారులు ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజు వసూలు చేయబడుతుందని స్పష్టం చేశారు. టోల్ గేట్ వద్ద వాహనాన్ని ఆపాల్సిన పని లేదని.. నంబర్ ప్లేట్ ఆధారంగా టోల్ ఫీజు వసూలు చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ప్రస్తుతం రవాణా శాఖ దీనిపై పని చేస్తుందని అన్నారు.

2018-19 సమయంలో టోల్ గేట్ల వద్ద ఒక్కో వాహనం సగటున 8 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేదని.. అయితే ఫాస్టాగ్ వచ్చిన తర్వాత 47 సెకన్లకు తగ్గిందని నితిన్ గడ్కరీ గుర్తుచేశారు. ఈ కొత్త జీపీఎస్ విధానం అమలులోకి వస్తే ఆ సమయం కూడా ఆగాల్సిన పనే ఉండదని అన్నారు. ఈ వ్యవస్థను ఆరు నెలల్లో అమలులోకి తీసుకొస్తామని అన్నారు. అంటే 6 నెలల తర్వాత టోల్ గేట్ వద్ద ఏ వాహనదారులు ఆగాల్సిన పని ఉండదన్నమాట. ట్రాఫిక్ సమస్యలు ఉండవు, పైగా జీపీఎస్ విధానం ద్వారా జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణించారో అంతే దూరానికి ఛార్జీలు వసూలు చేస్తారు. మరి వాహనదారుల ఛార్జీల భారాన్ని, వెయిటింగ్ సమయాన్ని తగ్గిస్తున్న కేంద్రంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Related posts

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్!

Drukpadam

బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

Drukpadam

రైతులకు కేంద్రం మీటర్ …రాష్ట్రం వాటర్: మంత్రి అజయ్ …

Drukpadam

Leave a Comment