Corona
ఆంధ్రప్రదేశ్

విశాఖలో కరోనా కలకలం …

  • మద్దిల పాలేనికి చెందిన యువతికి కొవిడ్ పాజిటివ్
  • ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి విడుదల
  • బాధితురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని వెల్లడి
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య శాఖ విజ్ఞప్తి

విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసు నమోదైంది. నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సదరు యువతి నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఈ ఫలితాన్ని మరింత ధ్రువీకరించుకోవడం కోసం, నమూనాను విశాఖ కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్‌‌గానే నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ ధ్రువీకరించారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం సాయంత్రం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలు ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

Related posts

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కీలక మార్పులు.. పలు పోలీస్ స్టేషన్ల పేరు మార్పు!

Ram Narayana

పల్నాడులో కర్ఫ్యూ వాతావరణం …పోలీసుల మార్చ్ 144 సెక్షన్

Ram Narayana

బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కీలక ప్రకటన!

Ram Narayana