Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బతకండి.. బతకనివ్వండి..: మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్…

బతకండి.. బతకనివ్వండి..: మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్…

  • మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవ
  • విష్ణు తీరుపై నిన్న వీడియో పోస్ట్ చేసిన మనోజ్.. తర్వాత డెలీట్
  • ‘సరైన దాని కోసం పోరాడుతూ చనిపోతాను’ అంటూ తాజాగా కొటేషన్ షేర్ చేసిన మనోజ్

మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ నిన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ట్విట్టర్ లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘‘బతకండి.. బతకనివ్వండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. కొటేషన్స్ ఉన్న మరో రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు.

‘‘అన్ని తప్పులను చూస్తూ పట్టించుకోకుండా జీవించడం కంటే.. సరైన దాని కోసం పోరాడుతూ చనిపోతాను’’ అని అమెరికన్ రచయిత సుజీ కాసెమ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘క్రియేటివిటీకి నెగిటివిటీనే పెద్ద శత్రువు’’ అంటూ అమెరికన్ ఫిల్మ్ మేకర్ డేవిడ్ లించ్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవ తర్వాతి రోజే మనోజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Related posts

వారం వారం విమానంలో వచ్చి వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటున్న బెంగళూరు వ్యాపారి

Ram Narayana

కేరళలో బెంబేలెత్తిస్తున్న టమాటా ఫ్లూ.. లక్షణాలు ఇవే!

Drukpadam

ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి నా ? గిరిధారా ??

Drukpadam

Leave a Comment