Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం అభివృద్ధికి ఘనత మీదే …మళ్ళీ గెలుపు మీదే పువ్వాడ పై పలువురు వక్తల ప్రశంసలు …

ఖమ్మం అభివృద్ధికి ఘనత మీదే …మళ్ళీ గెలుపు మీదే పువ్వాడ పై పలువురు వక్తల ప్రశంసలు …
ఖమ్మం టు టౌన్ ఆత్మీయ సమ్మేళనం..పాల్గొన్న మంత్రి పువ్వాడ ఎంపీ నామ!
ఖమ్మం ను సుందరనగరంగా తీర్చు దిద్దారు …రాష్ట్రాల్లోనే ఖమ్మం నెంబర్ వన్ గా నిలిచింది …
అభివృద్ధి ఎక్కడ అంటే ఖమ్మం వెళ్లి చూడండని సీఎం సైతం చెపుతున్నారు
ఇది మన మంత్రి అభివృద్ధికి తార్కాణం ..

ఖమ్మం అభివృద్ధికి ఘనత మీదే …మళ్ళీ గెలుపు మీదే పువ్వాడ పై పలువురు వక్తల ప్రశంసలు కురిపించారు … ఖమ్మం ను సుందరనగరంగా తీర్చు దిద్దారు …రాష్ట్రాల్లోనే ఖమ్మం నెంబర్ వన్ గా నిలిచింది …
అభివృద్ధి ఎక్కడ అంటే ఖమ్మం వెళ్లి చూడండని సీఎం సైతం చెపుతున్నారు
ఇది మన మంత్రి అభివృద్ధికి తార్కాణం అంటూ ఆయాప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై గణాంకాలతో సహా కార్పొరేటర్లు వివరించడం ఆసక్తిగా మారింది . నగరంలో అభివృద్ధిని అజయ్ పరుగులు పెట్టించారు …నగర రూపురేకలు మార్చారు . చాలాసంవత్సరాల తర్వాత ఖమ్మం వచ్చిన వారు తమ ప్రాంతాలకు వెళ్లాలంటే కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారని వక్తలు పేర్కొన్నారు . “అజయ్ మనకు ఎమ్మెల్యే కావడం ,మంత్రిగా అవకాశం రావడం అదృష్టమని మళ్ళీ తిరిగి ఆయన్ను తిరుగులేని మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతిన బూనారు” .

ముఖ్యమంత్రి కేసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం టు టౌన్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బైపాస్ రోడ్ లోని దోరేపల్లి ఫంక్షన్ హాల్ లో జరిగింది . ఈ సమావేశంలో ఎంపిక చేసిన ముఖ్యనేతలు అభిమానులను మాత్రమే ఆహ్వానించారు . అందుకు తగ్గట్లుగానే పెద్ద సంఖ్యలో ముఖ్యులు హాజరైయ్యారు ఈసమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ ఎంపీ నామలు పాల్గొని ప్రసంగించారు .

సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పూనుకొల్లు నీరజ,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేతా , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , ఖమ్మం నగర బీఆర్ యస్ అధ్యక్షులు పగడాల నాగరాజు ,మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ , ఆర్జేసీ కృష్ణ టు టౌన్ కు చెందిన 13 కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆద్యంతం నవ్వులు, పువ్వులతో సమ్మేళనం సాగింది. సీనియర్ పార్టీ నాయకులు శీలంశెట్టి వీరభద్రం సమావేశానికి అధ్యక్షత వహించారు .

“నా ఉన్నతికి కారకులు ఖమ్మం ప్రజలు ….కేసీఆర్ దయతో మంత్రి పదవి” …పువ్వాడ అజయ్

మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను ఇక్కడ ఓ పండుగ వాతావరణంలో ఇంటిల్లి పాదితో అందర్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీ ప్రేమ, అభిమానం వల్లే నేడు నేను ఇక్కడ ఉన్నానని, మీ అజయ్ అన్న ఎమ్మెల్యేగా చేసుకోవాలి అని మీరు అనుకున్నారు కాబట్టే నేను గెలిచాను.. గెలిచాను కాబట్టే ముఖ్యమంత్రి కేసీఅర్ నాకు మంత్రిగా పని చేయగలిగే అవకాశం కల్పించారని అన్నారు. ప్రతి గడపకు కేసిఆర్ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎవరు మంచి చేస్తున్నారో.. ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఖమ్మం నగరంలో వేల మందికి ఆసరా పెన్షన్ లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మీ, షాదిముభరక్ పథకాలను ద్విచక్ర వాహనంపై ఇంటింటికి వెళ్లి ఇస్తున్నాం.. ఇలా మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలు ప్రతి గడపకు అందిస్తున్నామన్నారు. మన పార్టీ మూడవ సారి హ్యాట్రిక్ కొట్టాలని, అందుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, ఇప్పటి వరకు మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తేనే చాలని అన్నారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని కొత్త .. కొత్త పగటి వేషగాళ్లు ఇళ్లకు వస్తుంటారని, వారి మాటలు నమ్మొద్దని, బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలను బిఆర్ఎస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఖాళీ స్థలం ఉన్న వారికి గృహ లక్షి పధకం కింద ఇంటి నిర్మాణo కోసం రూ. 3 లక్షలు తమ పార్టీ వారికి కూడా ఇస్తామన్నారు. తమ వారు కూడా పలు ప్రభుత్వ పథకాలకు అర్హులు ఉన్నారని తెలిపారు.

ఖమ్మం అభివృద్ధి జిల్లా వ్యాపితంగా ప్రభావం చూపుతుంది…ఎంపీ నామ

పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళాల్సింది ఉందని మంత్రి కంటే ముందుగా బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు మాట్లాడారు. 2018 ఎమ్మెల్యే ఎన్నికల అంశాన్ని గుర్తు చేసుకుంటూ ఎదో ఒక రకంగా పువ్వాడ గెలిచి బయటపడ్డారని అన్నారు. ఖమ్మం నగర అబివృద్ది పనులు చూసి నా ఎంపీ పరిధిలో ఇతర ఎమ్మెల్యేలు అడుగుతున్నారని , ఏడూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖమ్మం కూడా ఉందని చెప్పినట్లు ఎంపీ తెలిపారు. ఇక్కడ అభివృద్ధ్ది పనులు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతాయన్నారు. ఎన్నికల కోసం పోలింగ్ బూత్ వారీగా సమీక్షించాల్సి ఉందన్నారు. నగరంలో డబల్ రోడ్లు, డివైడర్లు ఉన్నాయని.. ఎందుకో నా ఇంటి వైపు డబుల్ రోడ్డు లేదన్నారు. రహదారి విస్తరంచాల్సి వస్తే ఇల్లు పోతుందని మంత్రి చెబుతుండగా అయినా పర్వాలేదని ఎంపీ నామా తెలియజేశారు. మన నాయకుడు కెసిఆర్ వల్లనే మనకి ప్రజల్లో ఈ గౌరవం దక్కిందని , ఇదంతా కార్యకర్తల కృషి వల్లనే సాధ్యమైందన్నారు. కార్యకర్తల కష్టంలో ఎల్లవేళలా అండగా ఉంటానని నామ స్పష్టం చేశారు. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిది సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత దేశంలో ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని తెలిపారు.

ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సీ.పీ.ఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. సీపీఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే, ఏమాత్రం తాత్సారం చేయకుండా సీపీఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. అనంతరం మంత్రి పార్టీ శ్రేణులకు భోజనాలు వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Related posts

వచ్చే ఆగస్టు తరువాత ఎన్నికలు … అధికారంలోకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జోశ్యం!

Drukpadam

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్!

Drukpadam

పార్టీలు ఫిరాయించడంలో గోవా ఎమ్మెల్యేల రికార్డు!

Drukpadam

Leave a Comment