Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కాంగ్రెస్ లో లొల్లి …భట్టి వర్సెస్ రేణుక చౌదరి…!

ఖమ్మం కాంగ్రెస్ లో లొల్లి …భట్టి వర్సెస్ రేణుక చౌదరి…!
-భట్టి లేకుండానే జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమం
-రాష్ట్ర ఇంచార్జి మాణిక్యరావు థాకరే రాక
-వైరాలో హత్ సే హత్ జోడో
-వైరా సభ పై భట్టి వర్గీయుల అసహనం
-ఎన్నికల ముందు గ్రూప్ తగాదాలపై అధిష్టానం ఆగ్రహం…
-తలనొప్పిగా మరీనా గ్రూప్ తగాదాలు
-దీంతో పార్టీలో చేరేందుకు తటపటాయిస్తున్నకొత్త నేతలు

ఖమ్మం కాంగ్రెస్ నాయకుల్లో లొల్లి మళ్ళీ మొదటికి వచ్చింది…ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా మలుచుకోవడంలో నాయకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.ఒకపక్క సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉండగా ,మరోపక్క మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు . కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలతో తలలు పట్టుకుంటున్నారు . ఎవరికీ వారు పైచేయి సాధించడం ద్వారా తమ అనుకూలంగా ఉన్నవారికి టికెట్స్ ఇప్పించవచ్చునని ఎత్తులు వేస్తున్నారు. పార్టీ కన్నా తమ వ్యక్తిగత తడాకా చుపిస్తామంటూ తొడలు కొడుతున్నారు .అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా ముఖం చూపించని నాయకులు జిల్లాకు వచ్చి ఇది కాంగ్రెస్ జిల్లా అని చెప్పడం హాస్యాస్పందంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 ,2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీ పార్టీకి జైకొట్టినప్పటికీ , ఖమ్మం జిల్లా ప్రజలు అందుకు భిన్నంగా తీర్పు నిచ్చారు .ప్రతిపక్షాలకు పట్టం కట్టారు . అప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేశారు . 2018 లో టీడీపీ కూడా కాంగ్రెస్ తో కలసి పోటీచేసి సత్తుపల్లి ,అశ్వారావుపేట రెండు సీట్లులో విజయం సాధించింది.

ఈసారి జిల్లా రాజకీయాలు కాంగ్రెస్ కు అంత అనుకూలంగా ఉన్నాయా అంటే చెప్పలేని పరిస్థితి . బీఆర్ యస్ కు దూరంగా ఉన్న పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఆధారపడి జిల్లా రాజకీయాలు ఉంటాయనే పరిశీలకుల అభిప్రాయం .అయితే ఎన్నడూ లేనిది కమ్యూనిస్టులు మొదటిసారిగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ యస్ తో కలిసి పోటీచేసేందుకు సిద్ధమైంది . దీంతో పొత్తులు ఎలా ఉంటాయి. ఏ ఏ సీట్లు కమ్యూనిస్టులకు ఇస్తారు …ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది . కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశంగా ఉంది .

కాంగ్రెస్ లో సీట్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు పెద్ద నాయకులు గతంలో అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు . ఇప్పుడు కూడా కొందరు అందుకే తమకు అన్ని సీట్లు ,ఇన్ని సీట్లు అని అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో సీటు ఇచ్చి గెలిపిస్తే మరో పార్టీలోకి పోవడం గత రెండు ఎన్నికల్లో జరిగింది.ఈసారికూడా అది జరగదనే గ్యారంటీ ఏమిటనే టాక్ నడుస్తుంది. అందువల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలవాతావరణం ఉన్నా వారి అవకాశవాద రాజకీయాలపై ప్రజల్లో చర్చ నడుస్తుంది. పైగా జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం , డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారనే అభియోగాలు మైనస్ గా మారాయి .

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడ అజయ్ , కోరం కనకయ్య , వైసీపీ నుంచి గెలిచిన బానోత్ మదన్ లాల్ , తాటి వెంకటేశ్వర్లు , పాయం వెంకటేశ్వర్లు ,గులాబీ గూటికి చేరారు . రామిరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో మాజీమంత్రి తుమ్మల టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు . పార్టీ మారినవారిలో ఒక్క పువ్వాడ తప్ప మిగతావాళ్ళు అందరు ఓటిమి పాలైయ్యారు .

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ , సిపిఐ లు కలిసి పోటీచేయగా టీఆర్ యస్ , సిపిఎం (బహుజన ఫ్రంట్ ) లు విడివిడిగా పోటీచేశాయి. దీంతో టీఆర్ యస్ కు ఒక్క ఖమ్మం అసెంబ్లీ నుంచి పువ్వాడ అజయ్ విజయం సాధించగా , మిగతా సీట్లలో ఓడిపోయింది . వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన లావుడ్య రాములు నాయక్ అనూహ్య విజయం సాధించారు . కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల (పాలేరు) , రేగా కాంతారావు(పినపాక ) , హరిప్రియ నాయక్ (ఇల్లందు) , వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం) తో పాటు వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రాములు నాయక్ అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు . తర్వాత టీడీపీ కి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , అశ్వారావు పేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరావు లు కేసీఆర్ కు జై కొట్టారు .దీంతో అధికార పక్ష బలం 8 మంది ఎమ్మెల్యేలకు చేరగా కాంగ్రెస్ కు సీఎల్పీ నేత భట్టి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు మాత్రమే మిగిలారు .

2014 ,2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు తమవల్లనే అని చెప్పుకునే నేతలు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా నిరోధించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.గెలిస్తే తమగోప్ప ,ఓడిపోతే ఎదుటివారి తప్పు అనే జాడ్యం కాంగ్రెస్ లో పెరిగింది . తర్వాత స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పెద్ద నాయకులు ముఖం చాటేసిన జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలే ఒంటరి పోరు చేశారు . కొద్దో గొప్పో మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎల్పీ నేత భట్టి తిరిగినా,మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి కనిపించలేదని విమర్శలు ఉన్నాయి.

జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొందరికి రేణుక అంటే సరిపడదు …మరికొందరికి భట్టి అంటే గిట్టదు …ఎవరన్నా పార్టీలో చేరదామన్న వల్లే అడిగే సీట్లు ఇవ్వరు …ఇచ్చిన మాకెంత అని బేరాలు పెట్టె పరిస్థితి దీంతో కాంగ్రెస్ లో చేరదామని ఉన్నా బేరాలు , వర్గపోరుతో మనకెందుకు కొత్త తలనొప్పి అని ప్రత్యాన్మయ మార్గాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ….

Related posts

ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం …

Drukpadam

దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోతోంది… మంత్రి జగదీశ్ రెడ్డి….

Drukpadam

ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్… అమిత్ షా వద్ద కె ఏ పాల్!

Drukpadam

Leave a Comment