Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి….సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్ రెడ్డి , చంద్రశేఖర్

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్ రెడ్డి , చంద్రశేఖర్
-మొదటివారంలో పడాల్సిన వేతనాలు రెండు వారాల్లో పడుతున్నాయి
-ఉద్యోగుల డి ఏ బకాయిలను విడుదల చేయాలి
-నూతన పీఆర్సీకి కమిటీ ఏర్పాటు చేయాలి
-మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లులు చెల్లించాలి
-మంత్రి ప్రకటించిన ఉద్యోగుల మెడికల్ పాలసీ అమలు చేయాలి 

30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో ఉండి ప్రజలకు సేవలు అందించాం …ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాం మా సమస్యలు పట్టించుకోని పరిష్కరించండి … మాకు గొంతెమ్మ కోర్కెలు ఏమీలేవు …మాకు ఇచ్చే పెన్షన్ ప్రతినెలా ఒకటి రెండు తేదీల్లో వేస్తె మా అవసరాలు తీరతాయి…. పెన్షన్ తో బతుకు వెళ్లదీసుకుంటున్న మాకు అన్యాయం చేయకండి అని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అంతేకాకుండా మాకు జబ్బు చేస్తే ప్రభుత్వ హాస్పత్రుల్లో సరైన వైద్యం అందటం లేదు . ప్రవేట్ కు వెళ్ళితే వచ్చే పెన్షన్ సరిపోవడంలేదు . కార్పొరేట్ హాస్పత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా మెడికల్ పాలసీ తెస్తామని మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రకటించారు . సంతోషకరం దాన్ని వెంటనే అమల్లోకి తెచ్చి వృద్ధులైన పెన్షన్ దార్లను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా పెన్షన్ దార్ల సమావేశం డిమాండ్ చేసింది .

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ,రిటైర్డు ఉద్యోగుల సంఘం ఖమ్మం నెహ్రునగర్ పెన్షనర్స్ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి సి. చంద్రశేఖర్ లు డిమాండ్ చేశారు . సోమవారం ఖమ్మం వచ్చిన వారు ఖమ్మంలోని పెన్షనర్లు భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వం చిన్న చూపు చూడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు . మొదటి వారంలో పడాల్సిన వేతనాలు నెలలో రెండవ వారం వరకు పడకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారు . కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 3డిఏ లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు . అలాగే ఆరోగ్య కార్డులు ద్వారా వైద్య సదుపాయాలను అన్ని హాస్పిటల్లో వర్తింప చేయకపోవడం పై ప్రభుత్వ చర్యలను వారు గర్హించారు . మెడికల్ రీ ఇంబర్స్మెంట్ బిల్లులను దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంచడం పై వారు ప్రభుత్వ చర్యలను తప్పు పట్టారు . నూతన వేతనాల సవరణ కోసం పిఆర్సి కమిటీని వేసి మెడికల్ రీ ఇంబర్స్మెంట్ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు . ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అధ్యక్షత వహించారు . ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య , రాష్ట్ర కార్యదర్శి శరత్ బాబు , నల్లగొండ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి , జిల్లా కోశాధికారి డీకే శర్మ , జిల్లా నాయకులు చెంచి రెడ్డి , జనార్దన్ రావు , ఉపేందర్ రావు , కె.వీరయ్య , తాళ్ళురి వేణు , వై పద్మావతి , మారంరాజు రాధాకృష్ణ , పి. రాజారావు , సి. బాబురావు , ఎం. సత్యనారాయణ , మధిర , వైరా , సత్తుపల్లి , తల్లాడ , కూసుమంచి మరియు ఖమ్మం నగరం నుండి తదితరులు పాల్గొన్నారు . ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సభ్యత్వం కల్పిస్తూ ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చినందుకు ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

Related posts

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత!

Drukpadam

తుపాను వేళ కాకినాడ జిల్లాలో సుడిగాలి బీభత్సం… !

Ram Narayana

సెప్టెఒంబర్ 17 తెలంగాణ కు స్వాతంత్ర్యం వచ్చినరోజు..

Drukpadam

Leave a Comment