కోలుకున్న పువ్వాడ నాగేశ్వరరావు …!
-నీరసంగా ఉండటంతో బుధవారం హైద్రాబాద్ తరలింపు
-కిమ్స్ లో చికిత్స … ప్రత్యేక రూమ్ కు షిఫ్ట్ చేయనున్నట్లు సమాచారం
-ఆయన దగ్గరే ఉన్న మంత్రి పువ్వాడ , సిపిఐ రాష్ట్ర నేత భాగం
సిపిఐ సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఐ శాసనసభ పక్ష నేతగా , మండలిలో పార్టీ నేతగా పనిచేసిన పువ్వాడ నాగేశ్వరరావు కు నీరసంగా ఉండటంతో బుధవారం ఉదయం ఖమ్మంలోని మమతా హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు . ఇక్కడ డాక్టర్ల సలహా మేరకు హైద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు . గత 24 గంటలుగా చికిత్స పొందుతున్న ఆయన కోలుకున్నారని ఆయన వెంట ఖమ్మం నుంచి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు తెలిపారు . నాగేశ్వరరావు గారికి ఇబ్బంది ఏమి లేదని ఐసీయూ నుంచి ప్రత్యేక రూమ్ కు తరలించనున్నట్లు పేర్కొన్నారు . పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు రాష్ట్ర రహణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి చికిత్స దగ్గర ఉంది చూసుకుంటున్నారు . అందువల్లనే గురువారం భద్రాచలం రావాల్సిన మంత్రి తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దుచేసుకొని హైద్రాబాద్ లోనే ఉన్నారు. మరో రెండు మూడు రోజులు డాక్టర్ల పర్వేక్షణలో ఉంచిన అనంతరం డిశ్చార్జ్ పై నిర్ణయం తీసుకుంటారని హేమంతరావు తెలిపారు…