Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కిమ్ కుమార్తె పై పాశ్చాత్య మీడియా అభ్యంతరకర రాతలు …!

కిమ్ కుమార్తె పై పాశ్చాత్య మీడియా అభ్యంతరకర రాతలు…!
-బాగా తిని బలిసిందని బరితెగింపు కథనాలు
-పైగా ఉత్తర కొరియన్లు కిమ్ కుమార్తె పై వ్యాఖ్యానిస్తున్నారని ప్రచారం
-ఇటీవల ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేపట్టిందని రాతలు
-కుమార్తెతో కలిసి కిమ్ క్షిపణి పరీక్షలు వీక్షించినట్లు ఫోటోలు
-కిమ్ కుమార్తె పుష్టిగా ఉండడంపై కొరియన్ల ఆగ్రహం అంటూ ప్రచారం …
-ఒకపక్క ఆదేశంలో జరుగుతున్నది బయట ప్రపంచానికి తెలియదంటూనే వస్తున్న వార్తలపై సందేహాలు ….

ఉత్తర కొరియా ఏషియా ఖండంలోని ఒక చిన్న దేశం… కిమ్ జాంగ్ ఉన్ ఏలుబడిలో ఉంది . చిన్న దేశం అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా నిరంతరం గళం విప్పుతుంది …కొందరు దీన్ని కమ్యూనిస్టుదేశమని , సోషలిజం ఉందని చెపుతుంటారు . అందరికి ఉపాధి ,తిండి ,బట్ట , వసతి సౌకర్యాలు ప్రజలందరికి ఉంటాయని అంటుంటే , మరికొందరు అది నియంత దేశమని కిమ్ అనే నియంత దాన్ని పారిపాలిస్తున్నాడని అక్కడ ఆకలి కేకలు అని అంటున్నారు . అక్కడ ప్రజలకు స్వేచ్చలేదని ,అక్కడ జరుగుతున్న ఏ విషయాలు బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదని పొరపాటుగా ఎవరైనా నోరు విప్పితే ఉరికంబం ఎక్కిస్తారని ,కఠినమైన శిక్షలు విధిస్తారని అంటారు . ఆదేశంలో మానహక్కులు హరించబడుతున్నాయని , దుర్మార్గపు చట్టాలు అమల్లో ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

అక్కడ జరుగుతున్ననేరాలు ,ఘోరాలు బయట ప్రపంచానికి తెలియవని, మీడియా కూడా వారి చెప్పు చేతుల్లోనే ఉందని ప్రచారం జరుగుతుంది. ఆదేశంపై జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత …అక్కడ విషయాలు బయటకు తెలివని…చెపుతున్నవారే అక్కడ ఆకలి కేకలని ,ఆ దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని , కేసుల సంఖ్య బయటకు తెలవడంలేదని అంటూనే అక్కడ జరుగుతున్న విషయాలు వెళ్లి చూసినట్లుగా చెప్పడం,రాయడం ,ప్రసారం చేయడం అనుమానాలు రేకెత్తిస్తుంది … ఒకపక్క అక్కడ జరుగుతున్న సంఘటనలు బయటకు తెలియవని అంటూనే కిమ్ పాలనపై చేస్తున్న ప్రచారం పరస్పరం విరుద్ధంగా ఉంటుంది …

అమెరికాకు కొరకరాని కొయ్యగా ఉన్న ఉత్తర కొరియా ను దెబ్బతీసేందుకు దశాబ్దాలుగా అమెరికా కూటమి చేయని ప్రయత్నమంటూ లేదు …దక్షణ కొరియా తో స్నేహం చేస్తూనే ఉత్తర కొరియా సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి .అక్కడ యుద్ధ వాతారణాన్ని తీసుకోని రావడం జరుగుతుంది . ఉత్తర కొరియా అధ్యక్షుడుగా ఉన్న కిమ్ కూడా అందుకు తగ్గట్లుగానే తమ మీద దాడి జరిగితే ప్రతీకారం తప్పదని హెచ్చరికలు చేస్తుంటారు . ఇప్పటికి అనేక సార్లు కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లాడని , ఆయనకు పెద్ద జబ్బు వచ్చిందని దాన్నుంచి కోలుకోవడం కష్టమని ,చనిపోయాడని, చనిపోయి కూడా చాలాకాలమైందని పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. కిమ్ సోదరి దేశానికి అధ్యక్షురాలుగా కాబోతుందని ,పాశ్చత్య మీడియా వార్తలు రాసింది .ప్రసారం చేసింది. కొన్ని రోజులు తర్వాత కిమ్ ప్రత్యేక్షం కావడం పాశ్చాత్య మీడియా నోరు వెళ్లబెట్టడం అనేకసార్లు జరిగింది . అక్కడ ఏమి జరుగుతుందో తెలియనప్పుడు ఆయన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ..? అసలు కొరియా లో ఏమి జరుగుతుంది. వారు చెప్పినట్లుగానే నియంతగా చెప్పబడుతున్న కిమ్ పాలనపై అక్కడ ప్రజలు నోరు విప్పే దైర్యం చేస్తారా ..? అనేది ఆసక్తికర పరిణంగా మారింది . ఆదేశంలో జరుగుతున్నదేమిటి ..? ఏది నిజం …ఏది అబద్దం తెలుసుకోవాల్సిందే … అయితే అదెలా సాధ్యం అసలు చెప్పేవారెవరు …. కొరియా గురించి బయటకు వస్తున్న కథనాలు గాలివార్తలా…? వాస్తవాలా…? గాలివార్తలు అయితే కమ్యూనిస్ట్ రాజ్యమే ,సోషలిజం వర్థిల్లుతుంది …వాస్తవాలు అయితే ప్రజాస్వామ్య దేశమే …ఎందుకంటే ప్రజలకు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి …

ఇటీవల ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టడం తెలిసిందే. ఈ క్షిపణి పరీక్షలకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో పాటు ఆయన కుమార్తె కిమ్ జు యే కూడా హాజరైంది. అయితే, కిమ్ కుమార్తె పుష్టిగా, ఆరోగ్యంగా, ఖరీదైన దుస్తులు ధరించి విలాసవంతంగా కనిపించడంపై ఉత్తర కొరియా ప్రజలు మండిపడుతున్నారని వార్తలు వస్తున్నాయి . తాను తన కుటుంబం విలాసవంతంగా ఉంటూ దేశ ప్రజల కడుపులు మాడ్చడం నిజంగా అన్యాయమే ఇది క్షమించరాని నేరం అదే జరిగితే దేశప్రజలు తిరగబడతారు . తిరగబడాలి కూడా కానీ అది జరగటంలేదు … అక్కడ కిమ్ కూతురిపై వ్యాఖ్యానాలు చేసే స్వేచ్ఛ ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు తిరగ బడటంలేదనేది ప్రశ్న …

కిమ్ కూతురు బాగా తిని బలిసిందని వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయిమీద అలాంటి రాతలు రాయడం, ఛండాలంగా మాట్లాడటం దుర్మార్గం .. ఆ అమ్మాయి బాగా తింటుందని తమకందరికీ తెలుసని, ఫ్యాన్సీ డ్రెస్సులు ధరించి టీవీల్లో కనిపిస్తుందని, ఎంతో లగ్జరీగా జీవిస్తుందని ఓ ఉత్తర కొరియా వాసి వెల్లడించారని అంటున్నారు…. ఆమె ఇష్టం వచ్చినట్టు తింటుందేమో… ఆమె ముఖం గుండ్రంగా, బొద్దుగా చందమామలా కనిపిస్తుంటుంది అని తమ ప్రజలు అనుకుంటుంటారని ఆ వ్యక్తి వివరించినట్లు కథనాలు వెలువడ్డాయి .

దేశంలో ప్రజలు తినడానికి సరిగా తిండిలేని పరిస్థితుల్లో చాలామంది బుగ్గలు పీల్చుకుని పోయి దవడలకు అంటుకుని ఉంటాయని, కానీ, కిమ్ కుమార్తె అందుకు విరుద్ధంగా ఉందని ఆ వ్యక్తి పేర్కొన్నట్లు చెప్పడం ఉత్తర కొరియా మీద కిమ్ మీద విషం చల్లుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

దేశ రాజధానిలో మిగతా పిల్లలు మూడు పూటలా భోజనం దొరక్క కష్టాలు పడుతుంటే, కిమ్ కుమార్తె చూడండి ఎలా ఉందో అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇలాంటి పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నాడు.

కాగా, కిమ్ సంతానం గురించి ఉత్తర కొరియా అధికారిక మీడియా ఎప్పుడూ ప్రస్తావించదు. అయితే, పొరుగునే ఉన్న దక్షిణ కొరియా నిఘా సంస్థ మాత్రం కిమ్ కు ముగ్గురు పిల్లలని… వారు 13, 10, 6 ఏళ్ల వయసు గలవారని చెబుతుంటుంది.

పాశ్చాత్య మీడియా చెపుతున్నట్లుగానే కిమ్ నియంత అయితే ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పే దైర్యం అక్కడ ప్రజలకు ఉంటుందా …? ఒకవేళ అక్కడ వ్యక్తులు కిమ్ కు వ్యాఖ్యానించటం నిజమైతే, కిమ్ నియంత పాలనకు చరమగీతం పడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి … ప్రజలు అంత స్వేచ్ఛగా మాట్లాడుతుంటే నియంత పాలనా ఎలా అవుతుందనేది మరో సందేహంగా ఉంది ….

 

Related posts

మునిసిపాలిటీగా అమ‌రావ‌తి… 22 గ్రామాల అభిప్రాయాల కోసం క‌లెక్ట‌ర్‌కు ఏపీ స‌ర్కారు ఆదేశాలు!

Drukpadam

The Best Eye Makeup Removers Money Can Buy

Drukpadam

దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది సజీవ దహనం!

Drukpadam

Leave a Comment