ప్రజా ఎమ్మెల్యే కందాల…పాలేరులో ఆయన పోటీ ఖాయం …బీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు …
ఎవరికో సీటు ఇస్తారనే ప్రచారం నమ్మవద్దు
ఏ గ్రామమైన ,ఏ మండలం నుంచి వచ్చిన ప్రజలకు నేనున్నాననీ భరోసా ఇస్తున్న ఎమ్మెల్యే కందాల
24 /7 అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే కందాల
సిపిఎం కు సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మధు వ్యాఖ్యలకు ప్రాధాన్యం …
తుమ్మల పాలేరు సీటు ఆశలపై నీళ్లు …
పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ బీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పొగడ్తల వర్షం కురిపించారు.తిరిగి కందాల పాలేరు నుంచి పోటీ ఖాయం …ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు .
ఆదివారం జీళ్లచెరువులో నిర్వహిస్తున్న క్రీడా పోటీల సభలో ఎంపీలు నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర ,డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తో కలిసి పాల్గొన్న మధు ఇటీవల పాలేరు నియోజకర్గంలో తిరిగి కందాల పోటీపై జరుగుతున్న ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు . వామపక్షాలతో పొత్తులో భాగంగా పాలేరు సీటును సిపిఎం కు ఇస్తున్నారని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పోటీచేయబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి స్పందనగా అన్నట్లు ఆయన ప్రసంగం సాగింది.
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో కందాల నియోజకవర్గంలో ప్రజలకు 24 /7 అందుబాటులో ఉన్నారు. తన పనితనం,ప్రజలకు అండగా ఉండటం నేనున్నాననే కొండంత దైర్యం ఇవ్వడం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఇది కందాల ప్రత్యేకత అని కొనియాడారు . కందాల అందరి ఎమ్మెల్యేల కన్నా మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారని,ప్రజల మన్ననలను పొందారని ప్రసంశలు కురిపించారు .
పాలేరుపై బీఆర్ యస్ కు చెందిన సీనియర్ నేత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశలు పెట్టుకొని నేనే పోటీచేస్తానని చెపుతున్న నేపథ్యంలో దాన్ని కందాలనే తిరిగి పోటీచేస్తారని చెప్పడం ద్వారా తుమ్మలకు పాలేరు సీటు ఇవ్వడం లేదని తేల్చి చెప్పి ఆయన ఆశలపై నీళ్లు చల్లారు .
సిపిఎం,సిపిఐ పార్టీలతో పొత్తుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ పాలేరు సీటుపై బీఆర్ యస్ వైఖరిని చెప్పే ప్రయత్నం చేశారు …కేసీఆర్ ఆధ్వరంలో రాష్ట్రంలో అభివృద్ధిని ప్రస్తావించారు. ఇంటూరి శేఖర్ జరుపుతున్న ఎడ్ల పందాలు , మహిళల జాతీయస్థాయి కబడ్డీ క్రీడలు జయప్రదంకోసం కృషి చేస్తున్న పార్టీ నాయకులకు , కార్యకర్తలకు అభినందలు తెలిపారు .