Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వివరణ పేరుతో కమ్యూనిస్టులపై షర్మిల విమర్శ … తమ్మినేని క్లాస్!

వివరణ పేరుతో కమ్యూనిస్టులపై షర్మిల విమర్శతమ్మినేని క్లాస్!
వైయస్సార్ సీపీ బీజేపీకి బీ టీం అన్న తమ్మినేని వ్యాఖ్యలపై షర్మిల అభ్యంతరం
బీజేపీపై నిక్కచ్చిగా పోరాడుతుంది తామే అన్న షర్మిల
బీజేపీ వ్యతిరేక పోరాటంలో షర్మిల నాటకాలు ఆడుతుందన్న తమ్మినేనితాము నాటకాలు ఆడటంలేదన్న షర్మిల
మునుగోడు ఎన్నికల్లో బీఆర్ యస్ కు కమ్యూనిస్టుల మద్దతుపైషర్మిల ప్రస్తావన
తమ కార్యాలయానికి మాట్లాడేందుకు ్చి తమనే ప్రశ్నించడంపై తమ్మినేని ఆగ్రహం
ఇదేమి మర్యాద అంటూ రుసరుసలు ….లీకేజ్ పై తాము స్పందించామన్న తమ్మినేని
రాజకీయాల్లో ఎవరి విధానాలు వారికీ ఉంటాయని తెలుసుకోవాలని సలహా

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మధ్యమంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. షర్మిల బీజేపీకి తొత్తు అని ఆమె నాటకాలు ఆడుతున్నారని తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఆమెకు మింగుడు పడలేదు. తాను ఎవరికీ తొత్తుని కాదని,నాటకాలు ఆడటంలేదని , బీజేపీకి వ్యతిరేకంగా తమ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే పోరాడుతుందని షర్మిల సీపీఎం రాష్ట్ర కార్యాలయం వద్ద ఎదురుదాడికి దిగారు. మునుగోడు ఎన్నికలను ప్రస్తావిస్తూ వామపక్షాలు బీఆర్‌ఎస్‌కు లొంగిపోయాయని షర్మిల ఆరోపించారు. దీనిపై వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది

లీకేజ్ వ్యహారంపై ఉమ్మడి పోరాటానికి పిలుపు నిచ్చిన షర్మిల అధికార బీఆర్ యస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఐక్యంచేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా సిపిఎం ,సిపిఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శలు ,తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు లకు ఫోన్ చేశారు . సాంబశివరావు మీ ప్రతిపాదన మంచిదే బీజేపీ ఉన్న వేదికను మేము పంచుకోవడం జరగదుఅయితే మీ అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వంతో చర్చించి నిర్ణయించుకుంటామని చెప్పారు . తమ్మినేని షర్మిల బీజేపీకి బీ టీం గా పనిచేస్తుందని చురకలు అంటించారు . దానిపై ఆమె సిపిఎం ఆఫీస్ కు స్వయంగా వెళ్లి మాట్లాడిన తర్వాత మీడియా తో మాట్లాడుతూ తమను బీజేపీకి బీ టీం అంటూ అన్న తమ్మినేని విమర్శలు చేయడం సరికాదని తామే బీజేపీ విధానాలపై పోరాడుతున్నామని , కమ్యూనిస్టులే మునుగోడులో బీఆర్ యస్ కు మద్దతు ఇచ్చి బీ టీం గా పనిచేశారని తమ్మినేని ముందే అనడంపై అక్కడే ఆమె మాటలపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు .

తమ కార్యాలయానికి వచ్చిన షర్మిల తమపై విమర్శలు చేయడం సరికాదని తమ్మినేని వీరభద్రం అభ్యంతరం వ్యక్తం చేశారు . ఒక్కో పార్టీకి ఒక్కో రాజకీయ ఎజెండా ఉందని, మునుగోడు ఎన్నికలపై తమ వైఖరి పారదర్శకంగా ఉందని స్పష్టం చేశారు. దీనిపై షర్మిల వ్యాఖ్యలు సరికావని తప్పు పట్టారు . ఆమె మాటలపై రుసరుసలాడారు . రాజకీయాల్లో ఎవరు వ్యూహాలు ,ఎత్తుగడలు వారికీ ఉంటాయని తమ్మినేని పేర్కొన్నారు .

Related posts

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు..!

Drukpadam

బీజేపీ ముక్తు భారత్ లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి : పాట్నా లో కేసీఆర్

Drukpadam

ఎన్నికలకు ముందే మూడు రాజధానుల ఏర్పాటు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్!

Drukpadam

Leave a Comment