Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముస్లింలకు మంత్రి పువ్వాడ అజయ్ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ.

ముస్లింల పవిత్ర పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు, ముస్లిం సోదర, సోదరీమణులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈద్-ఉల్-ఫీతర్ శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి నివాసంలో అతి స్వల్ప ముస్లిం పెద్దలతో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ వారితో పాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నమాజ్ ఆచరించారు.

 

నెల రోజుల పాటు అత్యంత నియమనిష్ఠలతో ఉపవాస దీక్షలు చేస్తు ప్రపంచ బాగు కోసం అల్లా ను ప్రార్దించిన ప్రతి ముస్లిం సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు.

మైనారిటీల వర్గాల అభ్యున్నతికి, ఆత్మగౌరవం తో తల ఎత్తుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు బాటలు వేశారన్నారు.

రంజాన్ పర్వదిన సంబరాల ను ముస్లిం సోదరులు ఆనందోత్సవాల మధ్య కరోనా మహమ్మారి నిర్ములన లో భాగంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Related posts

మలబద్ధకం వేధిస్తుందా..? దాని వెనుక రిస్క్ ఉంది..!

Drukpadam

బెలారస్ లో రష్యా అణ్వాయుధాల పార్కింగ్.. !

Drukpadam

Drukpadam

Leave a Comment