జాతీయ వార్తలు

ఈ నెల 29 వరకు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత…

  • ముగిసిన మండల దీక్షల సీజన్
  • నిన్న మండల పూజ అనంతరం ఆలయం మూసివేత
  • ఈ నెల 30న తిరిగి తెరుస్తామన్న ఆలయ వర్గాలు
  • జనవరి 14న మకర విళక్కు

దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది. నిన్న మధ్యాహ్నం మండల పూజ అనంతరం ఆలయం మూసివేశారు. 

ఈ నెల 29 వరకు ఆలయం మూసి ఉంచుతామని, తిరిగి మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. 

జనవరి 14న మకర విళక్కు పర్వదినం సందర్భంగా లక్షలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివస్తారు. 

కాగా, ఈ ఏడాది అయ్యప్పస్వామిని 32,39,756 మంది దర్శించుకున్నారు. గతేడాది 28,42,447 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.

Related posts

బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నారంటే…!

Ram Narayana

రాహుల్ గాంధీ అరెస్ట్.. ఢిల్లీలో హైటెన్షన్

Ram Narayana

 క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్… చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని…

Ram Narayana