Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బండి సంజయ్ ను విడిచిపెట్టొద్దు.. పీడీ యాక్ట్ పెట్టాలంటూ ఆర్​ఎస్​ ప్రవీణ్​ సంచలన ట్వీట్!

బండి సంజయ్ ను విడిచిపెట్టొద్దు.. పీడీ యాక్ట్ పెట్టాలంటూ ఆర్​ఎస్​ ప్రవీణ్​ సంచలన ట్వీట్!

  • ఎస్సెస్సీ పరీక్ష పత్రాల కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
  • అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందన్న ప్రవీణ్ కుమార్
  • అవినీతి రాజకీయ నాయకుల నుంచి తెలంగాణను కాపాడాలన్న బీఎస్పీ రాష్ట్ర అధినేత

పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణలతో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఈ కేసులో సంజయ్ ను విడిచిపెట్టవద్దన్నారు. మునుపటి నేరాలకు సంబంధించి ఆయనపై పీడీ యాక్ట్ కూడా పెట్టాలన్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు.

‘ఈ కేసులో వరంగల్‌ సీపీ అద్భుతంగా విచారణ చేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. బండి సంజయ్‌ని జైలు నుంచి విడుదల చేయకూడదు. ఈ కుట్రతో పాటు ఇతర మునుపటి నేరాలకు (ఇంకా ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు కాలేదు) ఆయనను పీడీ చట్టం కింద నిర్బంధించాలి. తరచూ నేరాలు చేసే వారిని, నిజాయతీ లేని, అవినీతి రాజకీయ నాయకుల నుంచి తెలంగాణను కాపాడాలని నేను కోరుతున్నాను’ అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Related posts

బెంగాల్ టైగర్ తిరిగి భవానీపురా నుంచే పోటీ…

Drukpadam

టీఆర్ యస్ లో బీసీ ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీల అంతర్మధనం …

Drukpadam

వద్దురా నాయన మోడీ పాలన … స్వయంగా మంత్రి హరీష్ రావు నినాదాలు!

Drukpadam

Leave a Comment