Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ ఒంటిమిట్టకు వెళ్లకుండా కుంటిసాకు…అచ్చెన్నాయుడు విమర్శ …

జగన్ ఇవాళ బాగానే కనిపించారు… ఒంటిమిట్ట అనగానే కాలు నొప్పి వచ్చిందా?: అచ్చెన్నాయుడు

  • నిన్న ఒంటిమిట్టలో శ్రీరామ కల్యాణం
  • కాలు బెణికిందంటూ సీఎం జగన్ పర్యటన రద్దు
  • ఇవాళ కార్యక్రమాల్లో జగన్ చక్కగా పాల్గొన్నారన్న అచ్చెన్న
  • ఒంటిమిట్టకు సతీసమేతంగా వెళ్లాల్సి ఉండడంతో కుంటిసాకు చెప్పారని విమర్శలు

కడప జిల్లా ఒంటిమిట్టలోని సుప్రసిద్ధ కోదండరామాలయంలో నిన్న వైభవంగా శ్రీరామ కల్యాణోత్సవం జరగడం తెలిసిందే. కాగా, ఈ కల్యాణోత్సవానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉండగా, కాలు బెణికిందంటూ ఆయన ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకున్నారు. సీఎం జగన్ ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రారంభించారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఆరోపించారు. సీఎం జగన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని స్పష్టం చేశారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో జగన్ చక్కగా పాల్గొన్నారని, ఒంటిమిట్ట కల్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా? అని నిలదీశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని వ్యంగ్యం ప్రదర్శించారు. కాలు బెణికిందంటూ ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి వెళ్లకుండా, చిలకలూరిపేట ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

Related posts

ప్రశ్నిస్తే కూల్చివేతలు ,భయోత్పాతం … అచ్చంనాయుడు మండిపాటు…

Drukpadam

భారీ షాట్లతో విరుచుకుపడిన పాక్ ఆటగాళ్లు… ఆసీస్ టార్గెట్ 177 రన్స్…

Drukpadam

జో బైడెన్ వ‌ద్ద‌ జోక్ వేసి న‌వ్వులు పూయించిన ప్ర‌ధాని మోదీ!

Drukpadam

Leave a Comment