Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి పోటీ ఎక్కడ నుంచి …ఖమ్మమా…? కొత్తగూడెం మా …??

పొంగులేటి పోటీ ఎక్కడ నుంచిఖమ్మమా…? కొత్తగూడెమా …??
ఉమ్మడి జిల్లాలో మూడే జనరల్ స్థానాలు
వాటిలో ఖమ్మం , పాలేరు , కొత్తగూడెం ఉన్నాయి..
పాలేరు నుంచి పోటీచేయరనే సంకేతాలు
పార్టీ ఏదైనా ఆయన అసెంబ్లీకి పోటీ ఖాయం
పార్టీలో చేరికపై తర్జభర్జనలురాజకీయ పరిశీలకులు , మేధావులతో సమాలోచనలు

ఖమ్మం జిల్లాలో ప్రజల్లో తనకంటూ ఒకస్థానం సంపాదించుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం ఖాయంఅయితే ఆయన ఎక్కడ నుంచి పోటీచేస్తారుఉమ్మడి జిల్లాలో ఉన్నఖమ్మం , పాలేరు , కొత్తగూడెం మూడు జనరల్ సీట్లలో దేన్నుంచి బరిలో దిగుతారనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒకటి మాత్రం ఖాయం ఆయన పాలేరు నుంచి పోటీచేయటం లేదు ..ఇక ఉన్న రెండు ఒకటి ఖమ్మం ,రెండవది కొత్తగూడెం కాగా రెండిటిలో ఖమ్మమాలేక కొత్తగూడెం నుంచి పోటీచేస్తారా అనేది ఆసక్తిగా మారిందిఎక్కడ నుంచి పొంగులేటి పోటీచేసిన ఆయన ప్రత్యర్థులు ఆలోచించుకోవాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

ఖమ్మం జనరల్ స్థానం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారుగత రెండు టర్మ్ లుగా ఆయనే గెలుస్తున్నారు. ఈసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని పావులు కదుపుతున్నారు . ఏదైనా అనుకోని పెద్ద మార్పు వస్తే తప్ప తిరిగి ఆయన పోటీ ఖాయమే ….

ఖమ్మం నియోజకవర్గంలో ఈసారి పువ్వాడ అజయ్ పోటీచేయరని ,హైద్రాబాద్ నగరంలోని కూకట్ పల్లి నుంచి పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారం పై మంత్రి అజయ్ భగ్గుమన్నారు . ఇది కొందరు పనీపాటాలేని వాళ్ళు చేస్తున్న ప్రచారంగా కొట్టిపారేశారు . అంతేకాకుండా కూకట్ పల్లి నుంచి ఎందుకు పోటీచేస్తాను పీకటానికా అంటూ ఆగ్రహం ప్రకటించారు . ఇక్కడ దంచేవాళ్ళు కొంతమంది ఉన్నారు …. రెండు సార్లు దంచాను ఇంకొకసారి దంచాల్సి ఉందిదంచిన తర్వాతనే ఇక్కడ నుంచి పోతానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల ద్వారా నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు . ఇప్పటివరకైతే పువ్వాడ అజయ్ కి సరైన పోటీ ఇచ్చేవారు లేరనే చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి పొంగులేటి పోటీచేస్తే గట్టి పోటీనే అవుతుందిపొంగులేటి వర్సెస్ పువ్వాడ అయితే గెలుపు ఎవరిదీ అనే చర్చ కొంతకాలంగా జరుగుతుందిఅయితే పొంగులేటి ఇక్కడ నుంచి చేస్తారా …? లేదా అనేది సందేహమే

ఇక పొంగులేటి పోటీచేస్తారని అనుకుంటున్నా మరో నియోజకవర్గం కొత్తగూడెంఅయితే బీఆర్ యస్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ణయం కాలేదుఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ యస్ లో చేరిన వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. తిరిగి తానే పోటీ చేస్తానని అంటున్నారు . అయితే ఆయన వయసు పై బడినందున ఈసారి అక్కడ నుంచి బీఆర్ యస్ పోటీచేస్తుందా …? లేక పొత్తులో భాగంగా సిపిఐ పోటీ చేస్తుందా …? అనే చర్చ నడుస్తుంది. బీఆర్ యస్ అయితే జలగం వెంకట్రావు , రాష్ట్ర హెల్త్ డైరక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు టికెట్ ఆశిస్తున్నారు . సిపిఐ అయితే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేస్తారుఎవరైనా పొంగులేటి పోటీచేస్తే గట్టిపోటీ ఉండటం ఖాయం

పొంగులేటి ఇంకా పార్టీలో చేరతారనేది నిర్ణయించుకోలేదుఅందుకోసం తర్జన భర్జనలు పడుతున్నారుఎదో ఇక నిర్ణయం తీసుకోవాలని ఆయన పై వత్తిడి పెరుగుతుంది…. ఆయనకూడా మరికొద్ది రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు. అందుకోసం సమాలోచనలు జరుపుతున్నారు . ఉన్న మార్గాలపై ప్లస్ లు మైనస్ లు గురించి ఆరాతీసుతున్నారురాజకీయ పరిశీలకుల , మేధావుల సలహాలు తీసుకుంటున్నారుతాను వేసే అడుగులు తనకే కాకుండా తనను నమ్ముకున్నవాళ్ళకి , జిల్లాకి ఉపయోగపడే విధంగా ఉండాలని భావిస్తున్నారు. చూద్దాం కొద్దీ రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోఎక్కడ నుంచి పోటీచేస్తారో …!

Related posts

జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి సిద్ధం: అలీ

Drukpadam

నా రాజీనామాతోనే కేసీఆర్ దిగొచ్చారు: ఈటల రాజేందర్

Drukpadam

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని….సీఎం జగన్ ఆదేశాలు…

Drukpadam

Leave a Comment