Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత…

తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత…
కొవిషీల్డ్ టీకా తొలి, రెండో డోసు మధ్య వ్యవధి పెంపు
కేంద్ర ఆదేశాలతో టీకా కార్యక్రమం నిలిపివేత
తిరిగి 17 నుంచి ప్రారంభం
తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేడు, రేపు కొవిషీల్డ్ స్పెషల్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం తిరిగి 17న ప్రారంభించనున్నట్టు తెలిపింది. కాగా, ఇప్పటి వరకు కొవిషీల్డ్ టీకాను తొలి, రెండో డోసులను 6-8 వారాల వ్యవధిలో ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 21 రోజులకే రెండవ డోస్ ఇచ్చేవారు.కాని కేంద్ర ఆదేశాల నేపథ్యంలో మార్పులు చేశారు.అందువల్ల మూడు నెలల నుంచి 4 నెలల లోపులో రెండవ డోస్ తీసుకునే ఆవకాశం ఉంది. అప్పుడు వ్యాక్సిన్ కూడా ఎక్కవగా ఉత్పత్తి అవుతుంది.ఇవి గాక దేశం లోకి స్పుత్నిక్ , జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు రానున్నాయి. అందువల్ల రానున్న రోజులలో దేశంలోని మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్ అందే అవకాశం ఎంతో దూరం లో లేదని వైద్య ఆరోగ్య రంగ నిపుణులు అంటున్నారు.

Related posts

కోట్లు ఖర్చు చేసి కొవిడ్ కోచ్‌లుగా మార్చితే ఒక్కరూ ఎక్కని వైనం!

Drukpadam

ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్ .. ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక!

Drukpadam

ప్లాస్మా దానానికి ముందుకొచ్చిన సచిన్ టెండూల్కర్

Drukpadam

Leave a Comment