Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ ఎంపీ రఘరామ అరెస్ట్ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం :చంద్రబాబు…

వైసీపీ ఎంపీ రఘరామ అరెస్ట్ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం :చంద్రబాబు…
-రాష్టంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది.
-వై కేటగిరి భద్రతా లో ఉన్న రఘురామ ను స్పీకర్ అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.
-ప్రతీకార రాజకీయాలు వదిలి కరోనా కట్టడిపై ద్రుష్టి సారించండి.
వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణమ రాజు అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. హైద్రాబాద్ లోని రఘురామ నివాసంలో ఎలాంటి వారంట్ లేకుండ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇదిమే న్యాయం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలలౌతుందా ?అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పాలన పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు పూనుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రతీకార రాజకీయాల పై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాలను కాపాడటంలో లేదని విమర్శించారు. వై కేటగిరి భద్రతలో ఉన్న ఒక ఎంపీ ని స్పీకర్ అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని అన్నారు.ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అనే అన్నారు. ఎంత సేపటికి పాలన పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని జగన్ ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా వైఫల్యం చెందిందని దీనికి ప్రజలు తగైనా గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించిన ప్రతివారిపై కేసులు పెట్టడం అరెస్టులు చేయడం అలవాటుగా మారిందని అన్నారు.

Related posts

ఏపీలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు వాహనం సిద్ధం !

Drukpadam

ఏపీలో బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి!

Drukpadam

లాలూ రాంచి టు ఢిల్లీ :తిరిగి ఢిల్లీ టు రాంచి!

Drukpadam

Leave a Comment