కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత…!
- యశోద ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ లీడర్
- గుండె రక్తనాళం పూడుకుపోయిందన్న వైద్యులు
- జానారెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మంగళవారం నాడు జానారెడ్డి సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. మోకాలి చికిత్స కోసం ఆయన వైద్యులను కలిశారు.
ఆయన మోకాలి నొప్పితో భాదపడుతూ ఆసుపత్రికి వెళ్లారు .జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు చేశారు .ఇందులో ఆయన గుండె రక్తనాళాలు పూర్తిగా పూసుకొని పోయాయి. దీన్ని ఆయనకు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు . వారి అనుమతితో మంగళవారం రాత్రి గుండెకు స్టెంట్ వేశారు . ఆరోగ్యంగా ఉండే జానారెడ్డికి పరీక్షల్లో గుండె పూడుకపోయినట్లు తేలడంతో కుటుంబ సభ్యులతోపాటు , కాంగ్రెస్ నాయకులూ ,ఆయన అనుయాయులు కంగు తిన్నారు . ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని ఇబ్బంది లేదని పేర్కొన్నారు .
ఈ క్రమంలోనే ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండె రక్తనాళాల్లో ఒకటి పూర్తిగా పూడుకుపోయిందని గుర్తించారు. ఇదే విషయం జానారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వివరించారు. వారి అనుమతితో మంగళవారం రాత్రి స్టెంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: