అలాంటప్పుడు కోర్టులు ఎందుకు.. మూసేయండి: అసదుద్దీన్ ఒవైసీ
- యూపీ గ్యాంగ్ స్టర్ కొడుకును ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
- మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్నారంటూ ఒవైసీ మండిపాటు
- బుల్లెట్లతో న్యాయం చేస్తామన్నప్పుడు కోర్టులు ఎందుకని ప్రశ్న
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఆ రాష్ట్ర పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ లో అసద్ అహ్మద్ అనుచరుడు, షూటర్ అయిన మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ అహ్మద్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ కౌంటర్లు నిర్వహిస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు ఈ కోర్టులు దేనికని ప్రశ్నించారు. న్యాయస్థానాలను మూసి వేయండని అన్నారు.
యూపీ లో పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించడం పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి తీవ్రంగా స్పందించారు . ఇలా ఎన్కౌంటర్లు చేసేటట్లయితే ఈ కోర్టులు ఎందుకు చట్టాలు ఎందుకు రద్దు చేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు . భారత రాజ్యాంగం ప్రకారం నేరం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొనే అధికారం కోర్టులకు ఉంది. కానీ చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం నేరం అవుతుంది అని ఆయన అన్నారు .