Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు…

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు…
ఏపీ హైకోర్టులో రఘురాజు హౌస్ మోషన్ పిటిషన్
సహేతుక కారణాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న న్యాయవాది
సీఐడీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని సూచించిన హైకోర్టు
రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు పూర్తి
రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
రఘురామ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
కాసేపట్లో రఘురామ కోర్టులో హాజరు
సన్నాహాలు చేస్తున్న సీఐడీ అధికారులు
మీకు ఎవరెవరు సహకరిస్తున్నారు?: రఘురామ కృష్ణం రాజుకు సీఐడీ ప్రశ్నలు
నిన్న అర్ధరాత్రి వరకు రఘురాజును ప్రశ్నించిన సీఐడీ అధికారులు
ఆయనకు ఆహారాన్ని అందిస్తున్న వ్యక్తిగత సిబ్బంది
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును నిన్న హైదరాబాదులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో రఘురాజు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కోర్టులో వాదనలు వినిపించారు.

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారన్న అభియోగాలపై అరెస్ట్ చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను కోర్టుకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే రఘురామను జైలుకు తరలించనున్నారు. కాగా, హైకోర్టు సూచనల మేరకు రఘురామకృష్ణరాజు దిగువ కోర్టులో సోమవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, రఘురామ కస్టడీని కోరుతూ సీఐడీ అధికారులు పిటిషిన్ వేయనుండగా, ఈ రెండు పిటిషన్ల విచారణలు సమాంతరంగా జరగను

ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే లోక్ సభ సభ్యుడు రఘురాజును అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రఘురాజు అరెస్టుకు సంబంధించి సహేతుక కారణాలు కూడా లేవని వాదించారు. ఎటువంటి కారణాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు.

వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ అంశంపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. దీంతో, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సీఐడీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

ఎంపీ రఘురామకృష్ణరాజును నిన్న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి గుంటూరుకు తీసుకెళ్లారు. నిన్న రాత్రి నుంచి ఆయన సీఐడీ కార్యాలయంలోనే ఉన్నారు. మరోవైపు నిన్న అర్ధరాత్రి వరకు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రశ్నించారు. విచారణకు సంబంధించి వివరాలు బయటకు వెల్లడి కానప్పటికీ… విశ్వసనీయ సమాచారం ప్రకారం… మీకు వెనుక నుంచి ఎవరెవరు సహకరిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మరోవైపు రఘురాజుకు ఈ ఉదయం వైద్యులు పరీక్షలను నిర్వహించారు. జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయి. ఆయనకు అవసరమైన మందులు, ఆహారాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది సీఐడీ కార్యాలయంలో అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు వీటిని అందజేశారు.

 

Related posts

How Good Interior Design Helps Elevate The Hotel Experience

Drukpadam

ట్రంప్​ హయాంలో తెచ్చిన హెచ్ 1 బి వీసా రూల్స్​ ను కొట్టేసిన అమెరికా కోర్టు అవి చెల్లబోవన్న ఫెడరల్ కోర్టు!

Drukpadam

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలు …10 వేల జరిమానా!

Drukpadam

Leave a Comment