Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ పై కేంద్రం కక్ష్యకట్టిందా …?

రాహుల్ గాంధీ పై కేంద్రం కక్ష్యకట్టిందా …?
ఆఘమేఘాలమీద నివాసం ఖాళీ చేసిన రాహుల్ …
అనర్హత వేటుతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలనీ తాఖీదు
దీంతో తన బంగ్లా ను ఖాళీ చేసిన రాహుల్
తన సామాన్లు తల్లి సోనియా నివాసానికి తరలింపు

రాహుల్ గాంధీ పై కేంద్రంకక్షకట్టిందే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. . అందులోభాగంగానే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడంతోపాటు ఆయన నివాసం ఖాళీ చేయంచడం దారుణమని కాంగ్రెస్ మండిపడుతుంది. లోకసభ సెక్రటరీ ఇచిన ఆదేశాలమేరకు రాహుల్ గాంధీ తన అధికార నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేశారు . తన నివాసంలో ఉన్న సామాన్లను తన తల్లి సోనియా నివాసానికి తరలించారు . ఈనెల 24 సమయం ఉన్న రాహుల్ మందుగానే ఖాళీ చేయడం గమనార్హం … మోడీలను ఉద్దేశిస్తూ ఒక వ్యక్తి సూరత్ కోర్ట్ కు వెళ్లారు ..కేసును విచారించిన సూరత్ మేజిస్ట్రేట్ కోర్ట్ రాహుల్ కు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. కోర్ట్ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నెలరోజులు సమయం ఇస్తూ , కోర్ట్ బెయిల్ కూడా మంజూరి చేసింది. అయనప్పటికీ ఆయనపై చర్యలు వెనువెంటనే తీసుకోవడం కక్ష సాధింపేనని అంటున్నారు . పరిశీలకులు …

ఇప్పుడు ఇది దేశ వ్యాపితంగానే కాకుండా ఆంతర్జాతీయ సమస్యగా మారింది . అనేక దేశాలు రాహుల్ గాంధీ పై తీసుకున్న చర్యలను గురించి ఆరా తీస్తున్నాయి. అమెరికా , జర్మనీ , బ్రిటన్ ఇప్పటికే తాము రాహుల్ పై చర్యలను గమనిస్తున్నామని తెలిపాయి. ఐక్యరాజ్యసమితి కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. రాహుల్ పై చర్యలకు కాంగ్రెస్ దేశవ్యాపితంగా ఆందోళనలు చేపట్టింది. సూరత్ జిల్లా కోర్టులో తనపై కింది కోర్ట్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలనీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈసందర్భంగా స్వయంగా రాహుల్ గాంధీ ,సోదరి ప్రియాంక తో కలిసి వెళ్లారు . రెండు రోజుల క్రితం తిరిగి కేసును ఈనెల 20 విచారణ చేపట్టనున్నట్లు కోర్ట్ తెలిపింది .కోర్ట్ తీర్పు ఎలా ఉన్న తనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడం ఆసక్తిగా మారింది….

2004లో లోక్ సభ సభ్యుడిగా గెలుపొందిన రాహుల్ గాంధీకి ఈ బంగళా కేటాయించారు. నాటి నుంచి ఈ భవంతి రాహుల్ అధికారిక నివాసంగా మారింది. అయితే..మోదీ పేరుపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్టు 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇటీవలే ఆయనను దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో నిబంధనలను అనుసరించి రాహుల్ మార్చి 23 నుంచి ఆటోమేటిక్‌గా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినట్టు లోక్‌సభ సెక్రెటరీ ఓ ప్రకటన జారీ చేశారు. ఆ తరువాత ఎంపీగా ఆయనకు కేటాయించిన అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 22 లోపల ఖాళీ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలోనే రాహుల్ తన బంగళా ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. 

 

Related posts

ఒడిదొడుకులు ఎదురైనా అంతిమ విజయం కమ్యూనిస్టులదే :పువ్వాడ!

Drukpadam

తరలింపే తక్షణ ప్రధాన కర్తవ్యం: 31 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టీకరణ!

Drukpadam

ఫారెస్ట్ అధికారి బలికి ప్రభుత్వ వైఫల్యమే కారణం:సీఎల్పీ నేత భట్టి !

Drukpadam

Leave a Comment